Rajasthan Crime: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. రూ.100 కోసం ఒక వ్యాపారవేత్తను దారుణంగా హత్య చేశారు. జిమ్ లో ఉన్న వ్యాపారిని ముసుగు కప్పుకొని వచ్చిన ఓ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే కాల్చి చంపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆపై తాము వ్యాపారిని ఎందుకు చంపాల్సి వచ్చిందోనన్న విషయాన్ని సైతం ఓ గ్యాంగ్ కు సంబంధించిన సభ్యుడు ఫేస్ బుక్ పోస్టులో వివరించాడు. ప్రస్తుతం ఈ హత్య రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని కుచామన్ పట్టణంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. వ్యాపారవేత్త రమేష్ రూలానియా (40) జిమ్ లో వ్యాయమం చేస్తుండగా.. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ కప్పుకొని లోపలికి వచ్చాడు. చేతిలోని తుపాకీ తీసుకొని కాల్పులు జరిపాడు. బిల్డింగ్ 2వ అంతస్తులో ఉన్న జిమ్ లోకి దుండగుడు ప్రవేశించి కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే మృతుడు రమేష్ కు కుచామన్ పట్టణంలో ఓ బైక్ షోరూం, హోటల్ ఉన్నట్లు తెలుస్తోంది.
कुचामन सिटी में व्यापारी रमेश रुलानिया की जिम में गोली मारकर हत्या, कुछ दिन पहले शहर के कई व्यपारियो को मिली थी धमकी।@RajPoliceHelp @Didwanapolice @8PMnoCM pic.twitter.com/Oy4u9UBn4D
— राजस्थानी बाबा (@marwadibabaji) October 7, 2025
హత్యకు కారణమిదే..
వ్యాపారి హత్యకు తామే కారణమని రోహిత్ గోడారా గ్యాంగ్ (Rohit Godara Gang) ప్రకటించుకుంది. ఈ గ్యాంగ్ రాజస్థాన్ లోని పశ్చిమ ప్రాంతాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఆ గ్యాంగ్ లో సభ్యుడైన వీరేంద్ర చరణ్.. ఈ హత్యకు సంబంధించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మేము సంవత్సరం క్రితం రూలానియాకు (Ramesh Rulania) కాల్ చేశాం. అప్పుడు అతడు చాలా దూషిస్తూ మాట్లాడాడు. నేను రూ.100 కూడా ఇవ్వను అని చెప్పాడు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. మేము ఎవరినీ మర్చిపోము’ అని వీరేంద్ర చరణ్ రాసుకొచ్చాడు. ‘ఎవరైనా మా ఫోన్ కాల్స్‌ను పట్టించుకోకపోయినా? నిర్లక్ష్యం చేసినా? మీకు ఇదే గతి పడుతుంది. సిద్ధంగా ఉండండి’ అని హెచ్చరించాడు. కాగా ఆ ప్రాంతంలో మరికొంత మంది వ్యాపారవేత్తలకు సైతం ఇలాంటి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు సమాచారం.
Also Read: Vizag Accident: దసరా రోజున కొత్త బైక్.. వారం గడవకముందే యాక్సిడెంట్.. యువకుడు మృత్యువాత
రోహిత్ గోడారా గ్యాంగ్ గురించి
రావత్రామ్ స్వామి అలియాస్ రోహిత్ గోడారా రాజస్థాన్‌లోని బికనూర్ కు చెందిన ఒక కేటుగాడు. ప్రస్తుతం అతను పోర్చుగల్‌లో దాక్కొని ఉన్నట్లు సమాచారం. 2022 డిసెంబర్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ రాజు తేహాట్ కేసులో మాస్టర్‌మైండ్‌గా రోహిత్ గోడారా ఉన్నాడు. అలాగే 2022 మేలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో కూడా అతని పేరు వెలుగులోకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో కర్ణి సేనా చీఫ్ సుఖదేవ్ సింగ్ గోగామేడీ హత్యకు కూడా గోడారా గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల దిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు రోనక్ ఖత్రిని రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దాని వెనుక కూడా రోహిత్ గోడారా గ్యాంగ్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.
