Airtel Offers (Image Source: Freepic)
బిజినెస్

Airtel Offers: రూ.500లోపు ఎయిర్‌టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. బడ్జెట్‌లో భలే మంచి బెన్‌ఫిట్స్!

Airtel Plans under Rs 500: దేశంలోని అగ్రశ్రేణి టెలికాం సంస్థల్లో భారతి ఎయిర్ టెల్ ఒకటి. కోట్లాది మంది యూజర్లను ఆకర్షించేందుకు ఎయిర్ టెల్.. ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ఆఫర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రీపెయిడ్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ప్యాక్స్ నుండి ఓటీటీ సబ్‌స్ప్రిక్షన్ వరకూ పలు రకాల ప్లాన్స్ ను యూజర్ల కోసం ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. అయితే రూ.500 లోపున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

మూడు విభాగాల్లో..

రూ.500 లోపు ఉన్న మూడు డిఫెరెంట్ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈ కథనంలో పరిశీలిద్దాం. తొలి దశలో రూ.500లోపు ఉన్న బెస్ట్ అన్ లిమిటెడ్ కాల్స్ విత్ డేటా పరిశీలిద్దాం. తర్వాత రోజువారి డేటా ప్యాక్స్ ప్లాన్స్, ఓటీటీ సబ్ స్ప్రిక్షన్ ప్యాక్స్ పై ఓ లుక్కేద్దాం.

అన్ లిమిటెడ్ కాల్స్ + డేటా

రూ.189 ప్లాన్ : అన్‌లిమిటెడ్ కాలింగ్, 1GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.199 ప్లాన్ : అన్‌లిమిటెడ్ కాల్స్ + 2GB డేటా (నెల మెుత్తానికి).

రూ.219 ప్లాన్ : అన్‌లిమిటెడ్ కాల్స్ + 3GB డేటా (నెల రోజులకి).

రోజువారీ డేటా ప్యాక్స్

రూ.249 రీచార్జ్ : రోజుకు 1GB డేటా, 24 రోజుల వాలిడిటీ.

రూ.299 ప్లాన్ : రోజుకు 1GB డేటా

రూ.349 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా

రూ.379 ప్లాన్ : రోజుకు 2GB డేటా

రూ.429 ప్లాన్ : రోజుకు 2.5GB డేటా

రూ.449 ప్లాన్ : రోజుకు 3GB డేటా

ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్

అధికంగా వినోదాన్ని కోరుకునే వారికి కోసం ఎయిర్ టెల్.. పలు ఓటీటీల సబ్ స్క్రిప్షన్ తో రూ.500 లోపు కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చింది.

రూ.181 ప్లాన్ : ఈ ప్లాన్ లో 15GB డేటా + Airtel Xstream Play ప్రీమియం లభిస్తుంది. వీటికి తోడు 22కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇందులో కాల్స్, ఎస్ఎంఎస్ లకు ఆస్కారం లేదు.

రూ.195 ప్లాన్ : 15GB డేటాతో పాటు Hotstar యాక్సెస్ లభిస్తుంది. 90 రోజుల పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

రూ.275 రీచార్జ్ : ఈ ప్యాక్ తో 1GB డేటా + 30 రోజుల వాలిడిటీ + Netflix Basic, Disney+ Hotstar Super, ZEE5, SonyLIV వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు. అలాగే Airtel Xstream యాక్సెస్ లభిస్తుంది.

Also Read: Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

డేటా, కాల్స్‌తో పాటు ఓటీటీ

రూ.398 ప్లాన్ : హాట్ స్టార్ యాక్సెస్ తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

రూ.440 ప్లాన్ : రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ + OTT యాక్సెస్. 28 రోజుల వాలిడిటీ.

Also Read: UNSC: 4 లక్షల మంది మహిళలపై.. పాక్ సైన్యం సామూహిక అత్యాచారాలు.. భారత్ సంచలన ఆరోపణలు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?