Lifetime Free Credit Card: కోటక్ బ్యాంక్ బంపరాఫర్.. ఒకే ఒక్క రూల్
Credit-Card (Image source X)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Lifetime Free Credit Card: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా?, కోటక్ మహీంద్రా బ్యాంక్ బంపరాఫర్.. కానీ, ఒకే ఒక్క రూల్

Lifetime Free Credit Card: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం చాలా కష్టం!. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ రిస్క్‌ను తగ్గించేందుకు కఠిన ప్రమాణాలు అమలు చేస్తూ, క్రెడిట్ హిస్టరీ మంచిగా లేనివారికి ముఖం చాటేస్తున్నాయి. క్రెడిట్ కార్డలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. క్రెడిట్ అప్లికేషన్లను కొన్నిసార్లు బాగా ఆలస్యం చేస్తుండగా, మరికొన్ని సార్లు పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. దీంతో, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన నేటి డిజిటల్ లావాదేవీల కాలంలో కొందరు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి తానున్నానని కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) అంటోంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, లైఫ్ లాంగ్ ఎలాంటి ఛార్జీలు లేని క్రెడిట్ కార్డును (Lifetime Free Credit Card) ఆఫర్ చేసింది. ఇందుకోసం ‘కోటక్811’ (Kotak811) పేరిట అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఒకే అకౌంట్.. 3 సేవలు

కోటక్ 811 ద్వారా త్రీ ఇన్ వన్ సర్వీసులు అందిస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. సూపర్.మనీ (Super.money) భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఈ అకౌంట్ ద్వారా జీరో-బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ (Savings Account), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), కోటక్811 సూపర్.మనీ (Kotak811 super.money) అనే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ను పొందవచ్చని తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా, (ఎఫ్‌డీ హామీపై) ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఖాతాదారుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువలో 90 శాతం వరకు క్రెడిట్ పరిమితి ఇస్తారు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ జారీ చేస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కనీసం రూ.1000 కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది.

Read Also- Rupee All Time Low: ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి దిగజారిన రూపాయి విలువ.. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

కనీసం రూ.5000 ఎఫ్‌డీ చేస్తేనే కార్డ్

కోటక్811 క్రెడిట్ కార్డు పొందాలంటే ఒకే ఒక్క నిబంధన ఉంది. అదేంటంటే, కనీసం రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన కస్టమర్‌లకు మాత్రమే కోటక్811 సూపర్.మనీ క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దీనిపై జీవితకాలం ఎలాంటి ఛార్జీలు పడవు. ఎఫ్‌డీ చేశాక ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. క్రెడిట్ కార్డు ఫిజికల్‌‌గా కావాలనుకునేవారు రూ.249తో పాటు పన్ను రుసుము చెల్లించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

ఎఫ్‌డీపై వడ్డీ కూడా

క్రెడిట్ కార్డు ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోని 90 శాతం వరకు ఉపయోగించినా, ఎఫ్‌డీపై కూడా ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. అలాగే, క్రెడిట్ కార్డు వినియోగం విషయంలో జీవితకాలం ఎలాంటి ఛార్జీలు ఉండబోవని, పైగా, ఎలిజిబిలిటీ ఉన్న వ్యయాలపై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా పొందవచ్చని వివరించింది. నెలకు 3.50 శాతం వడ్డీ రేటు ఉంటుందని, ఇది సంవత్సరానికి 42 శాతంతో సమానమని వివరించింది. ఇక, ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసినా, ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసినా రూ.100 ఛార్జీ పడుతుందని వివరించింది. కాగా, 2025 డిసెంబర్ 5 నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఛార్జీలను మార్చనుంది.

Read Also- Delhi Blast Case: పిండి మిల్లు ఉపయోగించి, ఇంట్లోనే బాంబు తయారీ.. ఢిల్లీ పేలుడు కేసులో మరో సంచలనం వెలుగులోకి!

మహీంద్రా బ్యాంక్ రూల్స్ ప్రకారం, కోటక్811 సూపర్.మనీ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ లిమిట్‌ను మించడానికి వీల్లేదు. అయితే, కస్టమర్‌ను బట్టి బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంపునకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక, క్రెడిట్ కార్డ్ పొందిన తర్వాత కూడా ఖాతాదారులు వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, క్రెడిట్ పరిమితి (Credit Limit) మిగిలిన ఎఫ్‌డీకి తగ్గట్టుగా తగ్గిస్తారు. ఇక, కార్డ్ అవసరం లేదనకుంటే, చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కార్డ్‌ను క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..