Gold Rates (01-08-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, ఆగష్టు 01, 2025 నాటికి బంగారం ధరలు తగ్గాయి. దీంతో, మహిళలు ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
24 క్యారెట్ల బంగారం ధర రూ.210 కి తగ్గగా రూ.99,820 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 కి తగ్గి రూ.91,500 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
విశాఖపట్టణం: రూ.99,820
వరంగల్: రూ.99,820
హైదరాబాద్: రూ.99,820
విజయవాడ: రూ.99,820
Also Read: MLC Addanki Dayakar: దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ కేసీఆర్.. అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్!
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
విశాఖపట్టణం: రూ.91,500
వరంగల్: రూ.91,500
హైదరాబాద్: రూ.91,500
విజయవాడ: రూ.91,500
Also Read: Deva Katta: ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం.. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,25,000 గా ఉండగా, రూ.2,000 తగ్గి ప్రస్తుతం రూ.1,23,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
విశాఖపట్టణం: రూ.1,23,000
వరంగల్: రూ.1,23,000
హైదరాబాద్: రూ.1,23,000
విజయవాడ: రూ.1,23,000