Mobiles Under Rs 10000: మంచి బడ్జెట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? రూ.10,000 లోపు బడ్డెట్‌లో బెస్ట్ మెుబైల్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్‌లో ఇప్పటివరకూ ఉన్న బడ్జెట్ ఫోన్లలో అత్యుత్తమమైన వాటిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. తక్కువ ధరకే లభిస్తోన్న ప్రముఖ కంపెనీ స్మార్ట్‌ఫోన్లను ఫిల్టర్ చేసి అందులో ది బెస్ట్ ను అందిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 వేల లోపు బడ్జెట్ లో ఉన్న టాప్ 5G స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ (Samsung Galaxy F06 5G)
రూ.10 వేల బడ్జెట్ లో మంచి శాంసంగ్ మెుబైల్ ట్రై చేయాలని భావించే వారు ఈ ఫోన్ ను ట్రై చేయవచ్చు. 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 50MP + 2MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ కలిగి ఉంది. ప్రస్తుతం ఇది రూ.9,999 సేల్ అవుతోంది. ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో ఈ మెుబైల్ పై బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
మోటొరోలా జీ 35 5జీ (MOTOROLA g35 5G)
మోటొరోలా నుంచి మంచి బడ్జెట్ ఫోన్ కోరుకునే వారు.. ఈ మెుబైల్ ను పరిశీలించవచ్చు. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్, 50MP + 8MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 4 GB RAM, 128 GB ROM స్టారేజ్ సామర్థ్యంతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.9,999 గా ఉంది. ఫ్లిప్ కార్డ్ లో ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
పోకో ఎం7 5జీ (POCO M7 5G )
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.88 అంగుళాల ఫుల్ హెచ్ డీ కెమెరా, 6 GB RAM, 128 GB ROM స్టోరేజ్, 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 33W సామర్థ్యం కలిగిన 5160 mAh బిగ్ బ్యాటరీ, 4 Gen 2 5G Processorను కలిగి ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.9,299 ఉంది. ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వేదికల్లో దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి.
వివో టీ4 లైట్ 5జీ (vivo T4 Lite 5G)
వివో కంపెనీలో మంచి బడ్జెట్ ఫోన్ ఆశించే వారు.. దీనిని ట్రై చేయవచ్చు. 6.74 అంగుళాల HD+ డిస్ ప్లే, 50MP + 2MP బ్యాక్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బిగ్ బ్యాటరీ, Dimensity 6300 5G ప్రొసెసర్ తదితర ఫీచర్లతో ఈ మెుబైల్ సాలిడ్ గా ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర రూ. 9,999.
రెడ్ మీ ఏ4 5జీ (Redmi A4 5G)
ప్రస్తుత రోజుల్లో రెడ్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటోంది. కాబట్టి రూ.10 వేల లోపు మంచి రెడ్ మీ ఫోన్ కోరుకునే వారు.. ఈ స్మార్ట్ ఫోన్ ట్రై చేయవచ్చు. 120Hz రిఫ్రెష్ రేటుతో 17.47cm లార్జ్ స్క్రీన్, 600nits peak బ్రైట్ నెస్, 50MP రియర్ డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడిన 5160mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంది. స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.8,798 గా ఉంది.
Also Read: Sheep Distribution Scam: రూ.700 కోట్ల అవినీతిపై కళ్యాణ్‌ను ప్రశ్నించిన అధికారులు
ఐకూ జెడ్10 లైట్ 5జీ (iQOO Z10 Lite 5G)
ఈ ఐకూ మెుబైల్ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. Funtouch OS 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లభిస్తోంది. 90Hz రిఫ్రెష్ రేటుతో కూడిన 6.74 అంగుళాల లార్జ్ డిస్ ప్లే, 15W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ, 50MP Sony AI Camera వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.9,998 అందుబాటులో ఉంది. అమెజాన్ లో ఈఎంఐ సౌఖర్యం కూడా ఉంది.