Deva Katta: వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ (Mayasabha: Rise Of the Titans).. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని ఇచ్చే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ‘మయసభ’ టీజర్ వచ్చినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అంతా డిస్కసన్ నడుస్తున్న విషయం తెలియంది కాదు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..
ఈ కార్యక్రమంలో దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ.. ‘పిలవగానే వచ్చిన తేజ్‌కు థాంక్స్. ‘మయసభ’ అనేది ఒక అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల జర్నీనే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచీ ఈ కాన్సెప్ట్ మెదడులో కదులుతూనే ఉండేది. శ్రీ హర్ష అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథగా రాశాను. కానీ, సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదని అర్థమైంది. ఆ తర్వాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌కు రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైమ్ పట్టింది. ధనీష్‌ను కలిసిన తర్వాతే దీనికి ఈ లుక్ వచ్చింది. ‘స్కామ్, మహారాణి’ వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ ప్రేక్షకులకు అందించింది. సోనీ నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లినప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ఈ ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చడంతో.. ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నారు. ‘బాహుబలి, రిపబ్లిక్’ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైమ్‌లో తోడుగా నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ సినిమా వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌లా నిలబడి సపోర్ట్ చేశారు. ఆది నటన అంటే నాకు ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా చేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే ఆదినే నాకు గుర్తొచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కూడా చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 264 మందిని తీసుకున్నాం. దివ్యా అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తర్వాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు.. ఎడిటర్ కేఎల్ ప్రవీణ్‌కు థ్యాంక్స్. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో గొప్ప మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుంది. అప్పటి నుంచి ఈ ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోందని అన్నారు.
Also Read- Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ ఎలా ఉందంటే?
సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ.. ముందుగా సాయితేజ్‌కు థ్యాంక్స్. కరోనా కంటే కాస్త ముందుగానే మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలనే స్టార్ట్ చేశాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించాం. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2022లో ఈ కథను దేవా కట్టా మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని అన్నారు. సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ.. దేవా కట్టా ‘మయసభ’ను అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎంత అందంగా నెరేట్ చేశారో.. అంతే అద్భుతంగా ఈ సిరీస్‌ను మలిచారు. ఎంతో గొప్ప నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. దేవా ఈ సిరీస్ కోసం వందకు 150 శాతం కష్టపడ్డారు. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌కు చేసి పెట్టిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు