Sai Durgha Tej
ఎంటర్‌టైన్మెంట్

Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Sai Durgha Tej: ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ (Mayasabha: Rise Of the Titans).. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన ఈ వెబ్ సిరీస్.. వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ‘మయసభ’ టీజర్‌ వచ్చినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏపీకి చెందిన ఇద్దరు అగ్ర లీడర్స్ కాంబోని ఈ సిరీస్ పరిచయం చేస్తుంది. వారెవరనేది ఇప్పటికే అందరికీ తెలిసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read- HHVM OTT: ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?.. ఇంత ఎర్లీగానా?

ఈ ట్రైలర్‌ని గమనిస్తే.. కృష్ణమ నాయుడు, ఎమ్.ఎస్. రామిరెడ్డి.. ఫ్రెండ్స్‌గా ఎలా మారారు? వారి మధ్య స్నేహం ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆ తర్వాత ఇద్దరూ ఎంత స్నేహంగా ఉన్నారు? అలాంటి స్నేహితులు రాజకీయాలలోకి అడుగు పెట్టడానికి కారణం ఏమిటి? రాజకీయాలలోకి అడుగు పెట్టిన తర్వాత వారిద్దరూ ఎలా మారిపోయారు? చివరికి వారిద్దరి మధ్య వైరం ఎంత వరకు వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్ అనేలా ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ ట్రైలర్ తర్వాత ఈ సిరీస్ చూడాలనుకునే వారి సంఖ్య మరింతగా పెరిగా అవకాశం లేకపోలేదు. ప్రజంట్ రాజకీయాలకు దగ్గరగా దేవా కట్టా రూపొందించిన ఈ సిరీస్‌లో ఎప్పటిలానే డైలాగ్స్ పవర్ ఫుల్‌గా పేలాయి. ట్రైలర్.. ఈ సిరీస్‌పై అంచనాలను పెంచేలా అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. దర్శకుడు దేవా కట్టాతో నాది పదేళ్ల ప్రయాణం. ఆయన ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. అలా ఆ జర్నీ నుంచే ‘రిపబ్లిక్’ అనే సినిమా వచ్చింది. ‘రిపబ్లిక్’ టైమ్‌లో నాకు జరిగిన ఘటనలో ఆయన ఎంతో అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా కోసం, ఇలా ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ మూడు సీజన్లకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా ‘మయసభ’ గురించి గతంలోనే నాతో చెప్పారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ‘30 వెడ్స్ 21’ చూసి మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని సతాయిస్తూ ఉండేవారు. అలా నా జీవితంలో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ సార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!

GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!