Roshni Walia
ఎంటర్‌టైన్మెంట్

Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!

Roshni Walia: ప్రస్తుతం పాశ్చాత్య పోకడ బాగా పెరిగిపోయింది. సాంప్రదాయ విలువలకు తిలోదకాలు వదిలి.. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలలో బీభత్సమైన మార్పులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో నాటి పరిస్థితులు, నేడు చాలా వరకు లేవంటే నమ్మాలి. పెళ్లి కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు యువత సహజీవనం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సంస్కృతి ఎక్కడి వరకు వెళుతుందో.. తెలియదు కానీ, ప్రస్తుతం పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. అన్నీ అంటే ఎవరి ఊహలకు తగిన విధంగా వారు ఊహించుకోవచ్చు. ఎందుకంటే, అంతా ఏఐ యుగంలోకి వచ్చేశాం. ఇంకా సంస్కృతి, సాంప్రదాయాలు, చట్టుబండలు అంటూ కూర్చొంటే.. మనకంటే ముందుకు వేరొకరు వెళ్లిపోతున్నారనే భావన ఒక్కొక్కరిలో పెరిగిపోతుంది.

Also Read- Coolie: ‘కూలీ’ పవర్‌హౌస్ సాంగ్ తెలుగులో వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

సరే ఇదంతా ఎందుకూ అంటే.. ఒకప్పుడు కుటుంబంలోని వారు కాకుండా పరాయి మగాడు కనిపిస్తే.. ఆడపిల్లలు ఇంట్లోకి పరిగెత్తేవారు. తల్లిదండ్రులు బిడ్డల్ని అలా పెంచేవారు. కానీ, ఇప్పుడు వచ్చినవాడు.. వాడే పోతాడు అని దారికి అడ్డంగా నిలబడే రోజుల్లో ఉన్నాం. ఇవన్నీ కాదులే కానీ, ఇప్పుడో తల్లి తన బిడ్డలకు ఇచ్చిన సూచన తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఇప్పటి సంస్కృతి ప్రకారం ఆమె చెప్పింది ఒక రకంగా మంచిగానే అనిపించినా, ఇంత దారుణంగా తల్లులు మారిపోయారా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరైతే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా? అంటూ షాక్ అవుతున్నారు. కొన్నాళ్లు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకునే వాళ్లం చూశాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సహజీవనం కామనే. అది ఇంకాస్త ముందుకు వెళితే.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వాళ్లను కూడా చూస్తునే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ నటి తల్లి తన కుమార్తెలకు ఇచ్చిన సలహా విని అంతా అవాక్కవుతున్నారంటే.. ఆ తల్లి ఏం సలహా ఇచ్చి ఉంటుందో? అర్థం చేసుకోవచ్చు.

Also Read- Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!

తన తల్లి తనకు ఇచ్చిన సలహాను ఆ కూతురు పబ్లిక్‌గా చెప్పడంతో.. ఆ నటి పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ నటి ఎవరో కాదు.. రోషిని వాలియా. ‘‘మా అమ్మ ఇప్పటి కాలానికి తగినట్లుగా ట్రెండీగా ఉంటుంది. తాగమంటుంది, పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేయమంటుంది. ఏం చేసినా ప్రొటెక్షన్ మాత్రం వాడమని సలహా ఇస్తుంది. నాకే కాదు, మా అక్కకు కూడా ఇదే చెబుతుంది. బయట పార్టీలకు, బాయ్స్‌తో ఎంజాయ్ చేయడానికి మా అమ్మ ఎప్పుడూ అడ్డు చెప్పదు. ఎప్పుడైనా నార్మల్‌గా ఇంటికి వెళితే.. ఏంటి ఈ రోజు తాగలేదా? అని అడుగుతుంది. మాకు అంత ఫ్రీడమ్ ఇస్తుంది’’ అని రోషిని వాలియా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. రోషిని వాలియా తల్లి పేరు స్వీటీ వాలియా. ముంబైకి చెందిన ఫ్యామిలీ. రోషిని వాలియా విషయానికి వస్తే.. నటిగా మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది. అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్’లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు