Rajinikanth in Coolie
ఎంటర్‌టైన్మెంట్

Coolie: ‘కూలీ’ పవర్‌హౌస్ సాంగ్ తెలుగులో వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘కూలీ’. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయ పరంపరని కొనసాగిస్తున్న లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. ఇందులో ఇటీవల వచ్చిన ‘కుబేర’తో సక్సెస్ అందుకున్న కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లుగా ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ స్పందనను రాబట్టుకోగా, తాజాగా ‘పవర్ హౌస్’ తెలుగు సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!

ఇప్పటి వరకు విడుదలైన ‘చికిటు’, ‘మోనికా’ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ కాగా, రీసెంట్‌గా తమిళ్‌లో వచ్చిన ‘పవర్ హౌస్’ సాంగ్ కూడా భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఇప్పుడు మేకర్స్ ‘పవర్ హౌస్’ తెలుగు లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన తెలుగు లిరిక్స్‌పై మిక్స్‌డ్ స్పందన వస్తోంది. కొందరు తెలుగు లిరిక్స్ చాలా బాగున్నాయని అంటుంటే.. మరికొందరు మాత్రం తమిళ్ సాంగే బాగుంది కదరా బాబు.. ఇవేం లిరిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పవర్ ప్యాక్డ్ సెన్సేషనల్ నెంబర్‌కు రాంబాబు గోసాల తెలుగు లిరిక్స్ అందించారు. అరివు అండ్ కోరస్ ఆలపించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌కి తగినట్లుగా రాంబాబు లిరిక్స్‌ని అందించినా, కొందరు రజనీకాంత్ అభిమానులు మాత్రం ఈ లిరిక్స్‌పై పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా ‘వార్ 2’ సినిమా ఉండటంతో కావాలనే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పాటపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారంటూ రజనీ ఫ్యాన్స్ కొందరు ఆరోపణలు చేస్తుండటం విశేషం.

Also Read- Hari Hara Veera Mallu: ఫేక్ రివ్యూస్.. నీ యాపారమే బావుందిగా నా అన్వేష్!

ఇక లిరిక్స్ సంగతి పక్కన పెడితే.. ఈ పవర్‌హౌస్ సాంగ్ లో రజనీ పవర్ ఫుల్ ప్రజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పుకోవచ్చు. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ‘కూలీ’ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. 2025 ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు