Hari Hara Veera Mallu: ఈ మధ్య కాలంలో చాలా మంది మూవీస్ చూడకుండా రివ్యూ లు ఇచ్చేస్తున్నారు. దీని వలన నిర్మాతలు దారుణంగా నష్ట పోతున్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ పైన పోరాడిన నా అన్వేష్ ఇప్పుడు దారి మార్చి, మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళ పని పట్టాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు.
Also Read: Priya Sachdev: 30,000 కోట్ల ఆస్తి వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ పేరు, బయోను మార్చిన సంజయ్ కపూర్ భార్య
నా అన్వేష్ ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నాడు. అయితే, హరి హర వీరమల్లు రిలీజ్ కు ముందు రోజు ఇప్పుడే పవన్ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్ అని రివ్యూ లా చెప్పి, లాస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇచ్చాడు. వీడియో ఓపెన్ చేయగానే మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా అదిరింది.. సూపర్ హిట్ అంతే.. ఇక థియేరటర్‌లో మోత మోగిపోద్ది.. గూస్ బమ్స్ పక్కా అని రివ్వ్యూ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు దీని గురించి చెబుతూ ఇంకో వీడియోని షేర్ చేశాడు. ” హరి హర వీర మల్లు వీడియోకి డబ్బులు ఎంత వస్తాయో చెబితే షాక్ అవుతారు. సినిమా చూడకుండానే చెబితే దగ్గర దగ్గరగానే 13 లక్షల మంది చూశారు. అయితే, ఇతర దేశాల వారు చూడటం వలన 1700 డాలర్లు వచ్చాయి. దానికి నాకు వచ్చింది.. అంటే 86 రూపాయలు ఒక డాలర్ వేసుకున్నా.. రూ. 1,55,000 వచ్చాయి. సినిమా చూడకుండానే రివ్యూ చెబితే ఇంత వచ్చింది. చూసి చెబితే ఇంకా ఎంత వచ్చేదో.. డబ్బులు ఇలా రావడంతో ఈ పత్తి వ్యాపారం బావుంది కదా ” అంటూ రివ్యూ చెప్పే వాళ్ళకి ఇన్ డైరెక్టుగా కౌంటర్ వేశాడు.
Also Read: BRS Party Leaders: గ్రామస్థాయి బీఆర్ఎస్‌లో గ్రూపులు.. ఎమ్మెల్యేలు మాజీల అనుచరులదే పెత్తనం!