Priya Sachdev ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Priya Sachdev: 30,000 కోట్ల ఆస్తి వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ పేరు, బయోను మార్చిన సంజయ్ కపూర్ భార్య

Priya Sachdev: వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తర్వాత, ఆయన భార్య ప్రియా సచ్‌దేవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును ‘ప్రియా సచ్‌దేవ్ కపూర్’ నుంచి ‘ప్రియా సంజయ్ కపూర్’గా మార్చి, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సమయంలో పేరు మార్చడంతో పలు రకాల అనుమానాలు వస్తున్నాయి. సంజయ్ కపూర్ నేతృత్వంలోని రూ. 30,000 కోట్ల విలువైన సోనా కామ్‌స్టార్ ఆటో కాంపోనెంట్స్ కంపెనీ వారసత్వ వివాదం నడుస్తున్న సమయంలో జరిగింది.

Also Read: Isha koppikar: ఆ సీన్ కోసం నాగార్జున నన్ను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారు.. ఈషా కొప్పికర్ కామెంట్స్ వైరల్

ప్రియా, సోనా కామ్‌స్టార్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా తన కొత్త బాధ్యతలను స్వీకరిస్తూ, “తల్లి, వ్యాపారవేత్త, ఇన్వెస్టర్, సోనా కామ్‌స్టార్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆరియస్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్” అని బయోను కూడా అప్డేట్ చేసింది.

Also Read: BRS KCR: సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి.. పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం!

సంజయ్ కపూర్ జూన్ 12, 2025న ఇంగ్లండ్‌లో ఆడుతుండగా గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తర్వాత, సోనా కామ్‌స్టార్‌లో వారసత్వం, నియంత్రణపై సంజయ్ తల్లి రాణీ కపూర్‌తో వివాదం తలెత్తింది. రాణీ కపూర్, కంపెనీ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)కి ముందు బోర్డుకు లేఖ రాస్తూ, తన కుమారుడి మరణం తర్వాత “వివరణ లేకుండా డాక్యుమెంట్లపై సంతకం చేయమని ఒత్తిడి చేశారు” అని ఆరోపించారు. ఆమె తాను సోనా గ్రూప్‌లో మెజారిటీ షేర్‌హోల్డర్‌నని, కొందరు “కుటుంబ ప్రతినిధులుగా” చెప్పుకుని చెలామణి అవుతున్నారని పరోక్షంగా ప్రియాను ఉద్దేశించి ఆమె ఆరోపణలు చేశారు

Also Read: Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్‌.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం