BRS KCR(IMAGE credit: twiter)
Politics

BRS KCR: సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి.. పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం!

BRS KCR: రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడటం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్(BRS) తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవెల్లి ఫామ్‌ హౌజ్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,(KTR) మాజీ మంత్రులు, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్(KCR) పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు.

 Also Read: Gadwal district: మరమ్మతులు నోచుకోని చెత్త సేకరణ వాహనాలు

ఈ సందర్భంగా గులాబీ బాస్ మాట్లాడుతూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గం అన్నారు. తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్(Congress) దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ చంద్రబాబు,(Candabau) అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి తహతహ లాడుతుండటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.

ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీనే..
కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి, వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా ఇంతవరకూ రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని సూచించారు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేయాలన్నారు. చెరువులు, కుంటలు రిజర్వాయర్లను నింపాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని దీనిపై పోరాటాలు చేయాలని మాజీ సీఎం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ గట్టిగా రెండు పార్టీలను నిలదీయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా, మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నడైనా అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read: PM Modi: ఉగ్ర మూకలపై చెప్పింది చేశాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?