HHVM OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫస్ట్ టైమ్ చారిత్రక యోధుడిగా నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా విఎఫ్‌ఎక్స్ విషయంలో, సెకండాఫ్ విషయంలో సినిమా చూసిన వారంతా నెగిటివ్‌గా స్పందించారు. ఫస్టాఫ్ విషయంలో మాత్రం పెద్ద హిట్ అనేలా టాక్ వచ్చింది. దీంతో మేకర్స్ మేల్కొని, సెకండాఫ్‌లో నాసిరకం విఎఫ్‌ఎక్స్ సన్నివేశాలను కత్తిరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సినిమాని మౌల్డ్ చేసినా, లాభం లేకుండా పోయింది. జరగాల్సిన డామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతం థియేటర్లలోకి కొత్త కొత్త సినిమాలు, కాస్త పేరున్న హీరోల సినిమాలు కూడా విడుదలవుతుండటంతో.. ‘వీరమల్లు’ పరిస్థితి మరింతగా డౌన్ అయింది. దీంతో 20 శాతం కూడా టికెట్స్ తెగడం లేదు. దీంతో అంతా ఈ సినిమాను భారీ డిజాస్టర్ జాబితాలో చేర్చేస్తున్నారు.
Also Read- Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!
మరోవైపు ఈ సినిమా రూ. 100 కోట్లకి పై కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా కొందరు లెక్కలు చెబుతున్నారు. ఇప్పుడెన్ని లెక్కలు చెప్పినా, ఎన్ని మార్పులు చేసినా, ఫలితం మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో , సినిమాను అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి తీసుకోరాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అవును, వాస్తవానికి థియేటర్లలో విడుదలైన 8 వారాలకు ఓటీటీలో విడుదల చేయాలనే రూల్ ఉన్నా, ఈ సినిమాను మాత్రం అంతకంటే ముందే ఓటీటీలోకి తీసుకురాబోతున్నారట. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉండటంతో, వెంటనే ఓటీటీలోకి తీసుకురావాలని అటు ఓటీటీ నిర్వాహకులు, ఇటు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిబంధనలను సడలించి ఈ సినిమాను 4 వారాల్లోనే ఓటీటీలోకి తీసుకురావాలనేలా గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.
Also Read- Kiara Advani: ‘రెడ్డిట్’లో హాట్ టాపిక్.. అక్కడ ఉన్నది దీపికానా..!
వీరమల్లు ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?
అంతేకాదు, వీరమల్లు ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ రిలీజ్ డేట్ కూడా బాగా ప్రచారంలో ఉంది. అది అలాంటిలాంటి డేట్ కాదు.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లుగా సమాచారం. అదే జరిగితే.. మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ ఓటీటీ విడుదలకు సంబంధించి ఇంత వరకు మేకర్స్ కానీ, ఓటీటీ సంస్థ యాజమాన్యం కానీ.. ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని మాత్రం తెలుస్తోంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ప్రముఖ తారాగణం నటించిన ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 200 కోట్లు అని తెలుస్తోంది. ప్రముఖ తారాగాణం నటించిన ఈ సినిమాకు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు