Chetebadi: కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా బాణామతికి చెందిన చేతబడి (Chetebadi), పల్లెల్లో కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. 16వ శతాబ్దంలో పుట్టిన ‘చేతబడి’ ఇప్పటికీ కొన్ని చోట్ల వినబడుతూనే ఉంది. ఇది మూఢనమ్మకం అని కొట్టేసే వారు ఉన్నట్టే.. ఇది ఇంకా ఉందని నమ్మేవారు కూడా ఉన్నారు. అందుకే ఇంకా ‘పోలిమేర’ వంటి సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దీనిని బేస్ చేసుకుని సినిమాలు తీసి హిట్ కొట్టారు. చేతబడి అనేది ఏ రూపంలో అయినా చేయవచ్చు అని వర్మ అందరికీ తెలిసేలా చేశాడు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి ఇప్పుడిదే టైటిల్‌తో, రియల్ ఇన్సిడెంట్స్‌తో ఓ సినిమాను చేస్తున్నారు శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- War 2: కియారాకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘వార్ 2’ మూవీ టీం.. అదిరిందిగా..
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో సూర్యాస్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘చేతబడి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘మా ఊరి పోలిమేర’ సిరీస్ చిత్రాల విజయంతో.. ఈ తరహా సినిమాలకు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతున్నారనేది తెలియంది కాదు. ఆ సిరీస్‌లో వచ్చిన సినిమాలు, రాఘవ లారెన్స్ ‘కాంచన’ సిరీస్ చిత్రాలు అపజయం అనేది తెలియకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటంతో, ఇప్పుడీ ‘చేతబడి’ మేకర్స్ ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని వారు భావిస్తున్నారు.
Also Read- Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!
ఈ సందర్భంగా దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ.. చేతబడి’ అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక విద్య. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా, లేదంటే రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపేసే విద్యే ‘చేతబడి’. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో ప్రేక్షకులు చూసి ఉన్నారు. ఇందులో చాలా విభిన్నంగా ‘చేతబడి’ని చూపిస్తున్నాం. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కు ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఉండబోతుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్‌గా జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేయడం జరిగింది. సీలేరు అనే గ్రామంలో దాదాపు 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్‌గా ఉండేవి. వర్షం పడినప్పటికీ అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి, అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది? అనేది ఇందులో ప్రేక్షకులకు చూపించబోతున్నామని చెప్పారు.
నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు బాణామతి భయంతో రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని, ఎలాంటి ఆటలు ఆడేవారూ ఈ చేతబడి చిత్రంలో రియలిస్టిక్‌గా చూపించబోతున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు