kiyara (image source :x)
ఎంటర్‌టైన్మెంట్

War 2: కియారాకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘వార్ 2’ మూవీ టీం.. అదిరిందిగా..

War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘ఊపిరి ఊయలగా’ అంటూ మెలొడీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఈ పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరపరచిన రొమాంటిక్ మెలోడీని, అరిజిత్ సింగ్ ఆత్మీయ గాత్రంతో ఆకట్టుకుంటూ, హృతిక్ రోషన్, కియారా అద్వానీల మధ్య ఆకర్షణీయమైన కెమిస్ట్రీని అద్భుతంగా చూపిస్తూ ఈ పాటను విడుదల చేశారు. హృతిక్, ఎన్టీఆర్, కియారా నటించిన ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌ను 2025 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పాటతో సినిమాపై మరింత అంచనాలు పెంచారు నిర్మాతలు.

Read also– Hyderabad Library: అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.. కలెక్టర్ హరిచందన దాసరి

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’ నుంచి మొదటి ట్రాక్‌ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ‘ఊపిరి ఊయలలాగా’ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’లోని బ్లాక్‌బస్టర్ పాట ‘కేసరియా’ పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మించిన ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Read also- Oval Test: భారత్-ఇంగ్లండ్ మధ్య మొదలైన 5వ టెస్ట్.. టీమ్‌లో 3 మార్పులు

కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. ముంబైలో జన్మించిన బాలీవుడ్ నటి. 2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ‘కబీర్ సింగ్’ (2019), ‘షేర్‌షా’ (2021), ‘భూల్ భులయ్యా 2’ (2022) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘భరత్ అనే నేను’ (2018) ‘వినయ విధేయ రామ’(2019) చిత్రాల్లో నటించింది. ‘వార్ 2’లో ఆమె హృతిక్ రోషన్తో రొమాంటిక్ పాత్రలో కనిపిస్తోంది. ఆమె నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, ప్రీతమ్ సంగీతంలో, అరిజిత్ సింగ్ గాత్రంతో విడుదలైన ‘ఊపిరి ఊయలగా’ పాటలో ఆమె కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు