Gold Rates: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, బంగారం ధర రికార్డు సృష్టించింది. 10 గ్రాముల బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు పలుకుతోంది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే మొదటిసారి.
Also Read: Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 22 న రూ.లక్ష దాటే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతి ఔన్సు బంగారం 3,400 డాలర్లకు పైగా ధర పలుకుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 98,350 గా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైనే పెరిగింది. ఇలా అమాంతం పెరిగిన బంగారం ధరలను చూసి సామాన్యులు లబో దిబో అంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు