Waqf Amendment Bill Protest: వక్ఫ్ బోర్డు కోసం అన్ని పార్టీల నాయకులు ఏకగ్రీవంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రత్యేక సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరిగిన నిరసన, ర్యాలీ కార్యక్రమానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీల శ్రేణులు హాజరయ్యారు.
CM Revanth reddy Japan Tour: ఉపాధి కల్పన లక్ష్యమే.. సీఎం రేవంత్ జపాన్ టూర్!
ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవ నిర్ణయంతో వక్ఫు బోర్డు సవరణ చట్టాలను అమలు సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పట్టణ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి, కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఎం, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు