Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 98,350 గా ఉంది. త్వరలో లక్ష వరకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు.ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
Also Read: Mahesh Babu: హీరో మహేష్ బాబుకు బిగ్ షాక్.. నెక్స్ట్ లిస్ట్ పెద్దదేనా? ఈడీ వెరీ స్పీడ్ బాస్..
అయితే, గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు పెరగడంతో కొనుగోలు దారులు షాక్ అయి గోల్డ్ కొనకుండా వెనుదిరుగుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.2,750 కు పెరిగి రూ. 92,900 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.3000 కు పెరిగి రూ.1,01,350 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 92,900
విజయవాడ ( Vijayawada) – రూ. 92,900
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 92,900
వరంగల్ ( warangal ) – రూ. 92,900
Also Read: Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 1,01,350
విజయవాడ – రూ. 1,01,350
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 1,01,350
వరంగల్ ( warangal ) – రూ. 1,01,350
Also Read: Singer Pravasthi : ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్ ఉన్నదెవరు? టార్గెట్ సునీత అందుకేనా?
వెండి ధరలు
గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.5000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ. 1,11,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ – రూ. 1,11,000
విజయవాడ – రూ. 1,11,000
విశాఖపట్టణం – రూ. 1,11,000
వరంగల్ – రూ. 1,11,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు