Gold Rates: కొత్త ఏడాది మొదటి రోజే బిగ్ షాకిచ్చిన గోల్డ్..
jan 2026 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: కొత్త ఏడాది మొదటి రోజే బిగ్ షాకిచ్చిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?

Gold Rates: కొత్త ఏడాది మొదటి రోజే గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. జనవరి 01, 2026 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. దీంతో, ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

ఈ రోజు బంగారం ధరలు ( జనవరి 01, 2026)

2025 డిసెంబర్ 31 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,050
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,800
వెండి (1 కిలో): రూ.2,56,000

Also Read: GHMC Achievements 2025: హైదరాబాద్ చరిత్రలోనే ఇదొక మైలురాయి.. 2025 సంవత్సరంలో ఇదే అతి పెద్ద రికార్డు..?

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,050
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,800
వెండి (1 కిలో): రూ.2,56,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,050
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,800
వెండి (1 కిలో): రూ.2,56,000

Also Read: Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,35,050
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,800
వెండి (1 కిలో): రూ.2,56,000

Also Read: Delhi Shopping Mall: మూతపడ్డ మాల్‌లోకి వెళ్లిన ఫ్రెండ్స్.. శవంగా తిరిగొచ్చిన టీనేజర్.. అసలేం జరిగింది?

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,57,000 గా ఉండగా, రూ.1000 కు తగ్గి, ప్రస్తుతం రూ.2,55,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్: రూ.2,55,000
విజయవాడ: రూ.2,55,000
విశాఖపట్టణం:రూ.2,55,000
వరంగల్: రూ.2,55,000

Just In

01

Drunk And Drive Test: హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి కరాటే దెబ్బలు.. వెధవ అంటూ ఫైర్ అయిన కళ్యాణి..

Government Land Scam: పెనుబల్లి ప్రభుత్వ భూమి అక్రమ పట్టా పై కదులుతున్న డొంక.. సబ్ కలెక్టర్ పాత్రపై అనుమానాలు?

Urea Monitoring: తెలంగాణలో తొమ్మిది మంది స్పెషల్ అధికారుల తనిఖీలు.. ఇక ఆ సమస్యకు చెక్..!

Air India Pilot: ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు షాక్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో దొరికిపోయిన ఎయిర్ ఇండియా పైలట్..!