Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు?
Bank holidays ( Image Source: Twitter)
జాతీయం

Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

 Bank Holidays 2026: ప్రపంచమంతా 2026కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వేళ, ఆర్థిక లక్ష్యాలు, బ్యాంకింగ్ అవసరాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ హాలిడే క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు రోజులను నగరాల వారీగా వివరించింది.

2026లో బ్యాంకులు జాతీయ పండుగలు, రాష్ట్రస్థాయి పండుగలు, అలాగే ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల కారణంగా బ్యాంకులను మూసి వేయనున్నారు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవులు దేశమంతటా అమలులో ఉండగా, మహాశివరాత్రి, ఉగాది, బక్రీద్, జన్మాష్టమి, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు రాష్ట్రాలవారీగా భిన్నంగా ఉంటాయి. దీంతో ప్రతి నగరంలో బ్యాంక్ సెలవుల సంఖ్య మారనుంది.

10 జనవరి  2026  –  2వ శనివారం –  శనివారం
24 జనవరి 2026 –   4వ శనివారం –  శనివారం
26 జనవరి 2026 –  గణతంత్ర దినోత్సవం –  సోమవారం
14 ఫిబ్రవరి 2026 –  2వ శనివారం – శనివారం
28 ఫిబ్రవరి 2026 – 4వ శనివారం – శనివారం
15 ఫిబ్రవరి 2026 –  మహా శివరాత్రి – ఆదివారం
3 మార్చి 2026 – హోలీ –  మంగళవారం
14 మార్చి 2026 –  2వ శనివారం – శనివారం
20 మార్చి 2026  – ఉగాది  – శుక్రవారం
28 మార్చి 2026 – 4వ శనివారం – శనివారం
3 ఏప్రిల్ 2026 – గుడ్ ఫ్రైడే – శుక్రవారం
11 ఏప్రిల్ 2026 – 2వ శనివారం –  శనివారం
14 ఏప్రిల్ 2026 – వైశాఖి/అంబేద్కర్ జయంతి – మంగళవారం
25 ఏప్రిల్ 2026 – 4వ శనివారం – శనివారం
1 మే 2026 – మే డే –  శుక్రవారం
9 మే 2026 – 2వ శనివారం – శనివారం
23 మే 2026 – 4వ శనివారం – శనివారం
27 మే 2026 – బక్రీద్/ఈద్ అల్-అధా  – బుధవారం
13 జూన్ 2026 – 2వ శనివారం –  శనివారం
27 జూన్ 2026 – 4వ శనివారం – శనివారం
11 జూలై 2026 –  2వ శనివారం –  శనివారం
25 జూలై 2026 – 4వ శనివారం – శనివారం
8 ఆగస్టు 2026 – 2వ శనివారం – శనివారం
15 ఆగస్టు 2026 – స్వాతంత్ర్య దినోత్సవం – శనివారం
22 ఆగస్టు 2026 – 4వ శనివారం – శనివారం
4 సెప్టెంబర్ 2026 – జన్మాష్టమి – శుక్రవారం
12 సెప్టెంబర్ 2026 – 2వ శనివారం – శనివారం
26 సెప్టెంబర్ 2026 – 4వ శనివారం – శనివారం
2 అక్టోబర్ 2026 – గాంధీ జయంతి – శుక్రవారం
10 అక్టోబర్ 2026 – 2వ శనివారం – శనివారం
24 అక్టోబర్ 2026 – 4వ శనివారం – శనివారం
8 నవంబర్ 2026 – దీపావళి – ఆదివారం
14 నవంబర్ 2026 – 2వ శనివారం – శనివారం
28 నవంబర్ 2026 – 4వ శనివారం – శనివారం
12 డిసెంబర్ 2026 – 2వ శనివారం –  శనివారం
25 డిసెంబర్ 2026 – క్రిస్మస్ రోజు – శుక్రవారం
26 డిసెంబర్ 2026 – 4వ శనివారం – శనివారం

అయితే, ఈ సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవని RBI స్పష్టం చేసింది. రాష్ట్రాలు, నగరాల ప్రకారం బ్యాంక్ హాలిడేలు మారుతాయి. అందువల్ల ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ప్లాన్ చేసుకునే ముందు, తమ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి హాలిడే లిస్ట్‌ను పరిశీలించాలని ఖాతాదారులకు సూచించింది.

బ్యాంకులు మూసివున్నా, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, UPI, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కౌంటర్ సేవలు అవసరమైన లావాదేవీలకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి అని సూచిస్తున్నారు. మొత్తంగా, 2026లో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ముందుగానే తెలుసుకుని, ఆర్థిక పనులను సమయానికి పూర్తి చేసుకోవడం ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

Just In

01

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన

Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!

Minister Seethakka: గ్రామాల అభివృద్ధికి.. సీఎం రేవంత్ కృషి.. మంత్రి సీతక్క