Nov 11
బిజినెస్

Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా పెరగడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని అయోమయంలో పడ్డారు. అయితే, ఈ రోజు ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 11, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

Also Read: Smart Phone : ఐక్యూఓఓ 15 యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. 5 ఏళ్ల OS అప్‌డేట్‌, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ప్రకటించిన కంపెనీ!

ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 11, 2025)

నవంబర్ 10 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,280
వెండి (1 కిలో): రూ.1,70,000

Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,280
వెండి (1 కిలో): రూ.1,70,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,280
వెండి (1 కిలో): రూ.1,70,000

Also Read: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్!

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,750
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,280
వెండి (1 కిలో): రూ.1,70,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,67,000 గా ఉండగా, రూ.3000 పెరిగి ప్రస్తుతం రూ.1,70,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,70,000
వరంగల్: రూ.1,70,000
హైదరాబాద్: రూ.1,70,000
విజయవాడ: రూ.1,70,000

Just In

01

National Education Day 2025: నేషనల్ ఎడ్యుకేషన్ డే.. మన దేశంలో ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?

Gujarat Ricin Plot: ప్రసాదాలు, తాగునీటిలో విషం.. వందలాది మంది హత్యకు కుట్ర.. హైదరాబాది ఉగ్రవాది ప్లాన్

Kishan Reddy: త్వరలో అందుబాటులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కిషన్ రెడ్డి

Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?

Jubliee Hills Bypoll Live Updates: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఎన్నికల అధికారి సీరియస్.. స్థానికేతరులపై కేసులు