BSNL New Plan: ప్రభుత్వ ఆధ్వర్యంలోని BSNL ఎప్పుడూ బడ్జెట్-ఫ్రెండ్లీ మొబైల్ ప్లాన్‌లను అందిస్తూ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, అదనపు ప్రయోజనాలతో కూడిన ఆఫర్లు అందించడం BSNL ప్రత్యేకత. తాజాగా Children’s Day సందర్భంగా, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని BSNL ప్రత్యేక Learners ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా కోరుకునే యువతకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
BSNL Rs. 251 Plan
రూ.251 Learners ప్లాన్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్ 100GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా, ఇందులో డైలీ డేటా లిమిట్ లేకపోవడం విద్యార్థులకు పెద్ద ప్రయోజనం. రోజూ ఆన్‌లైన్ క్లాసులు, రీసెర్చ్, ప్రాజెక్టులు చేసే విద్యార్థులకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా మారుతోంది. దీనికి తోడు రోజుకు 100 ఫ్రీ SMS కూడా అందిస్తుండటం గమనార్హం.
ఈ ప్లాన్ యొక్క validity మొత్తం 28 రోజులు. BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే చాలా తక్కువ ధరలో ఈ ప్రయోజనాలను అందిస్తుండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే ఇది ఒక లిమిటెడ్-టైమ్ ఆఫర్ కావడంతో BSNL డిసెంబర్ 13, 2025 ను చివరి తేదీగా నిర్ణయించింది. ఈ గడువు తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు కాబట్టి రీచార్జ్ చేసుకోవాలనుకునే వారు త్వరపడాలి.
BSNL బడ్జెట్ వినియోగదారుల కోసం మరో అఫోర్డబుల్ వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రూ.2,399 ధర గల ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల validityతో వస్తోంది. దీనిలో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా, BSNL త్వరలో 5G సేవలను ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం.
వినియోగదారుల భారీ డిమాండ్ నేపథ్యంలో, BSNL తన ప్రసిద్ధ రూ.1 Freedom ప్లాన్‌ను కూడా మళ్లీ ప్రవేశపెట్టింది. నెలరోజుల పాటు ఫ్రీ కాలింగ్, డేటా అందించే ఈ ప్లాన్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు BSNL వరుసగా ఆకర్షణీయమైన ఆప్షన్‌లను అందిస్తూ ముందంజలో నిలుస్తోంది.

