BSNL Recharge Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త 2GB డైలీ డేటా రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు, మంచి వాలిడిటీతో ఈ ప్లాన్ బడ్జెట్‌లో ప్రయోజనాలు అందిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్, సోషల్ మీడియా, OTT స్ట్రీమింగ్.. ఇవన్నీ చేసే యంగ్ యూజర్లకు ఇది పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలుస్తోంది.
రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణ రోజుకు 2GB హై-స్పీడ్ డేటా. యూట్యూబ్, రీల్స్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు వంటి దైనందిన ఉపయోగాలకు ఈ డేటా పూర్తిగా సరిపోతుంది. 2GB లిమిట్ పూర్తయిన తర్వాత కూడా BSNL తగ్గించిన స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా అందించడం ప్రత్యేకత. దీంతో ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకుండా కనెక్టివిటీ కొనసాగుతుంది.
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఎక్కువ సేపు మాట్లాడేవారికి, తరచుగా ప్రయాణించే వారికి ఇది వరంగా మారింది. చాలా ప్రాంతాల్లో BSNL వాయిస్ కాల్ నెట్‌వర్క్ స్థిరంగా ఉండటం మరో పెద్ద ప్లస్.
రోజుకు 100 SMS ఉచితం
రోజుకు 100 SMS ఇచ్చేటట్లు BSNL ఈ ప్లాన్‌ను డిజైన్ చేసింది. బ్యాంకింగ్ OTPలు, కాలేజ్ అప్‌డేట్స్, జాబ్ అలర్ట్స్ వంటి అవసరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అదనపు SMS ప్యాక్ అవసరం లేకుండా మొత్తం కమ్యూనికేషన్ ఒకే రీచార్జ్‌తో పూర్తవుతుంది.
తక్కువ ధర.. ఎక్కువ వాలిడిటీ
ప్రైవేట్ టెలికామ్ సంస్థలతో పోల్చితే BSNL 2GB ప్లాన్లు చాలా వరకు తక్కువ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్లు రూ.199 నుండి ప్రారంభమై 28 రోజుల వాలిడిటీ ఇస్తుండగా, మరికొన్ని ఆప్షన్లు రూ. 393 కు 90 రోజుల వరకూ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ పరంగా చూస్తే ఇది స్టూడెంట్స్, యంగ్ ఉద్యోగులు అందరికీ సరైన ఆప్షన్.
స్థిరమైన నెట్‌వర్క్, ప్రభుత్వ మద్దతు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న BSNL, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మంచి కవరేజ్ కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 4G విస్తరణ కొనసాగుతున్నందున డేటా స్పీడ్, కాల్ క్వాలిటీ మరింత మెరుగవుతున్నాయి. కనెక్టివిటీ లోపాలు తక్కువగా ఉండటం వల్ల రోజువారీ ఇంటర్నెట్, కాలింగ్ అవసరాలకు BSNL కొత్త ప్లాన్లు ఉపయోగపడతాయి.

