TG Rising Global Summit 2025: ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్(Telangana Rising Global Summit)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది పూర్తిగా ఎకనమిక్ సమ్మిట్ అని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్, ఐఎస్బీ -హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. ఈనెల 8న మధ్యాహ్నం 1:30కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 సమ్మిట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని మొత్తం క్యాబినెట్ ఆలోచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంతర్జాయ స్థాయిలో పేరొందిన ఎకనమిస్టులు ప్రసంగిస్తారని తెలిపారు. మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆప్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్(DK Shiva Kumar), నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను కూడా ప్రసంగిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. సమ్మిట్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 నిమిషాలకు కీలక ప్రసంగం చేస్తారని ఆయన చెప్పారు. గ్లోబెల్ సమ్మిట్‌లో అనంతరం పలు డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని చెప్పారు.
Also Read: Annagaru Vastaaru Trailer: కార్తి ‘అన్నగారు వస్తారు’ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది చూశారా..
154 మంది డెలిగెట్స్..
తెలంగాణ రైజింగ్ గ్లొబల్ సమ్మిట్‌లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాన్నారు. స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించామన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలని, అందరిని పిలవడం జరిగిందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు సెషన్‌లు ప్రారంభం అవుతాయన్నారు. సెషన్ అంశంకి సంబంధించిన శాఖ మంత్రి.. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు పాల్గొంటారన్నారు. ఈ సెషన్స్‌లో ఎక్స్‌పర్ట్స్ పాల్గొంటారన్నారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలవగా, సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
రాష్ట్రానికి ప్రయోజనం..
తెలంగాణ రైజింగ్ గ్లోబెల్ సమ్మిట్ 2025 అనేది ప్రత్యేక సమ్మిట్ అని ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్న సదుద్దేశంతో చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్‌కి సంబంధించినదని అభివర్ణించారు. ఈ ఎకనమిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎతంగానో ఉపయోగపడుతుందన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్ లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Also Read: Bus Accident: బిగ్ బ్రేకింగ్.. బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు స్పాట్‌లో 35 మంది..

