Jio Recharge Plans: Jio సిమ్ వాడుతున్న వాళ్లలో చాలామందికి తక్కువ ఖర్చుతో మంచి రీచార్జ్ ప్లాన్ కావాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారందరికీ జియో రూ.200 లోపే కొన్ని మంచి ప్లాన్లు అందిస్తోంది. ఇవి డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS వంటి బెనిఫిట్స్‌తో పాటు JioTV వంటి యాప్స్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నాయి. ఈ బడ్జెట్ సెగ్మెంట్ ప్లాన్లు వినియోగదారులకు మంచి విలువను ఇస్తుండటంతో వీటి డిమాండ్ పెరుగుతోంది.
రూ.198 ప్లాన్ విషయానికి వస్తే, ఇది 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అలాగే ఫ్రీగా JioTV యాక్సెస్ అందుతుంది. డేటా ఎక్కువగా ఉపయోగించే యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. రూ. 186 ప్లాన్ కూడా మంచి డీల్‌గానే చెప్పాలి. 28 రోజుల పాటు దీనిలో రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు అందుతాయి. ముఖ్యంగా జియో ఫోన్ వాడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
రూ. 152 ప్లాన్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. 28 రోజుల వాలిడిటితో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 0.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తం 300 SMSలు, అలాగే JioTV యాక్సెస్ అందుతుంది. తక్కువ డేటా అవసరాలున్న వారికి ఇది మంచి ఎంపిక. ఇదే విధంగా, రూ.125 ప్లాన్ కూడా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 23 రోజుల పాటు ఇది రోజుకు 0.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, JioTV యాక్సెస్‌ను ఇస్తోంది. సాధారణ వాడకానికి ఇది చీపెస్ట్ & బెస్ట్ ప్లాన్‌గా చెప్పొచ్చు.
రూ. 200 లోపే జియోలో ఇంకా చాలా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవాలంటే Jio అధికారిక వెబ్సైట్‌లోని పూర్తి వివరాలు చూడడం మంచిది. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
