Apple iPhones: గ్లోబల్ ఐటీ దిగ్గజం యాపిల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కొత్త సిరీస్ ఫోన్లు మార్కెట్లో విడుదలైనప్పుడైతే తెగ ఎగబడుతుంటారు. అలాంటి కస్టమర్ల కోసం యాపిల్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 9న ఐఫోన్17 (Apple iPhone 17) సిరీస్ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. ఐఫోన్17 లాంచింగ్ ఈవెంట్‌లో 4 కొత్త మోడల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఐఫోన్17 (iPhone 17), ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air), ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro), ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లను (iPhone 17 Pro Max) మార్కెట్లో విడుదల చేయనుంది.
బ్యాడ్ న్యూస్ ఇదే..
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రానుండడం గుడ్‌న్యూస్, అయితే, ఇప్పటికే కంపెనీకి చెందిన ఆరు పాత మోడల్స్ (iPhones, Apple Watches) మార్కెట్ నుంచి క్రమంగా కనుమరుగు కానున్నాయి. ఆ ఉత్పత్తులను కంపెనీ ఉపసంహరించుకోనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఐఫోన్16 (iPhone 16 Pro), ఐఫోన్ ప్రో మ్యాక్స్ (16 Pro Max) లను యాపిల్ మార్కెట్ నుంచి క్రమంగా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. యాపిల్ కంపెనీ సాధారణంగా ఒకేసారి రెండు ‘ప్రో’ జనరేషన్ ఫోన్లను విక్రయించదు. ఇదే విధానంలో గతంలో కొత్త మోడల్ ఫోన్లు వచ్చాక ఐఫోన్15 ప్రో సిరీస్ ఫోన్లు మార్కెట్ నుంచి కనుమరుగయ్యాయి.
Read Also- Lambadi – Banjara: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి.. లంబాడి, బంజారాల డిమాండ్
ఇప్పటికే మార్కెట్లో రిటైలర్లు, మొబైల్ షాపుల్లో ఐఫోన్16 సిరీస్ ఫోన్లు ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మిగిలివున్న స్టాక్‌ను బట్టి అమ్మకాలు ఎన్ని రోజులు జరుగుతాయనేది ఆధారపడి ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, లేదా బ్లాక్ ఫ్రైడే వంటి ప్రత్యేక సేల్స్ సమయంలో కొంత డిస్కౌంట్లకు ఈ ఫోన్లు లభించే అవకాశం ఉంటుంది. స్టాక్ పరిమితంగానే ఉండొచ్చని అంచనాగా ఉంది.
ఐఫోన్ 15 సిరీస్ కనుమరుగేనా!
సెప్టెంబర్ 9న కొత్త ఐఫోన్17 సిరీస్ ఫోన్లు ప్రకటించబోతున్న నేపథ్యంలో, పాత మోడల్ ఫోన్లు మార్కెట్ నుంచి క్రమంగా కనుమరుగు కానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ విక్రయాలను యాపిల్ కంపెనీ వెంటనే నిలిపివేయబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. యాపిల్ అధికారిక స్టోర్లలో లభించకపోవచ్చని సమాచారం. కానీ, రిటైల్ స్టోర్లు మిగిలివున్న స్టాక్ విక్రయాలు మాత్రం కొనసాగుతాయి. ఈ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. డిమాండ్‌ను బట్టి డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. మరోవైపు, ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్స్‌ను మాత్రం ధర తగ్గించి మార్కెట్లో కొనసాగించే అవకాశం ఉంది. సాధారణంగా యాపిల్ నాన్-ప్రో మోడల్ ఫోన్లను కొంతకాలం కొనసాగించి మార్కెట్లలో విక్రయిస్తుంటుంది.
Read Also- Ram Charan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?
యాపిల్ వాచ్‌లలో మార్పులు
యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల లాంచింగ్ ఈవెంట్‌లో యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు కూడా విడుదల కానున్నాయి. కొన్ని కీలకమైన అప్‌డేట్‌లతో స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 10 స్థానంలో కొత్త సిరీస్ 11 విడుదల కానుంది. యాపిల్ వాచ్ అల్ట్రా 3 కూడా విడుదల కానుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే, అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్ మార్కెట్ నుంచి కనుమరుగు కానుంది. యాపిల్ వాచ్ ఎస్‌ఈని మాత్రం కొంతకాలం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.
మొత్తంగా ఐఫోన్ 15 సిరీస్ లేదా, గతేడాది విడుదలైన యాపిల్ వాచ్ మోడల్స్ కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. యాపిల్ కంపెనీ అధికారిక స్టోర్లలోనే కొనుగోలు చేయాలనుకునేవారైతే మిగిలివున్న ఈ కొన్ని రోజుల్లోనే త్వరపడడం మంచిది. కొత్త సిరీస్ ఫోన్ల లాంచింగ్ తర్వాత రిటైల్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.