Lambadi
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Lambadi – Banjara: ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ నుంచి బ‌హిష్క‌రించాలి.. లంబాడి, బంజారాల డిమాండ్

Lambadi – Banjara: సోయం బాబూరావు, తెల్లం వెంకట్రావ్‌లపై చర్యలు తీసుకోవాలి

లంబాడి, బంజారాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
మండిపడిన లంబాడి, బంజార సంఘాల నాయకులు

జ‌న‌గామ‌, స్వేచ్చ‌: లంబాడి, బంజారా, సుగాలి జాతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోయం బాబురావ్‌, తెల్లం వెంక‌ట్రావ్ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఖండిస్తున్నామ‌ని, వారిద్దర్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని లంబాడి బంజారా సమాజం (Lambadi – Banjara) సీనియర్ నాయకులు మూడ్ లక్ష్మణ్ నాయక్, అజ్మీరా స్వామి నాయక్, గగులోత్ బొజ్య నాయక్  డిమాండ్ చేశారు.

ఆదివారం జనగామలోని గూగులోత్ లచ్చయ్య నాయక్ ఇంట్లో బంజారా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బంజార‌, లంబాడి, సుగాలిల‌ను ఎస్టీలుగా రాజ్యాంగం గుర్తిస్తే వారిని ఎస్టీల నుంచి తొల‌గించాల‌ని ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు డిమాండ్ చేయ‌డం స‌రికాద‌ని మండిపడ్డారు. ‘‘మా జాతి బిడ్డ‌ల‌కు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను కాల‌రాయాల‌ని చ‌ట్ట‌స‌భ‌్యులు చూడడం విడ్డూరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది లంబాడి, బంజారా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాల‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని హెచ్చరించారు.

Read Also- Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!

భార‌త రాజ్యాంగం లంబాడి, బంజార, సుగాలిల‌ను ఎస్టీలుగా గుర్తించి హ‌క్కులు క‌ల్పించింద‌న్న విష‌యం ఇద్ద‌రు ఎమ్మెల్యేలు విస్మ‌రించి, సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకునేలా కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇద్ద‌రిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. లేకుంటే లంబాడి, బంజార, సుగాలి జాతి నుంచి కాంగ్రెస్‌కు ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకాక త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. వెంక‌ట్రావ్‌, బాబురావ్‌లు జాతి వైష‌మ్యాలు రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లు మానుకోవాల‌ని, లేకుంటే ప్ర‌జా ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌ద‌న్నారు. ఈ సమావేశంలో బంజారా ధరావత్ సోమ్లా నాయక్, భూక్య వాసు నాయక్, భూక్య చందు నాయక్, లకావత నరేష్ నాయక్, బాణోత్ జితేందర్ నాయక్, బానోత్ కోట నాయక్, కొర్ర కాలరాం నాయక్, బాలు నాయక్, గోవింద్, రవి, రాములు పాల్గొన్నారు.

Read Also- Period Delay: పీరియడ్స్‌ ఆలస్యంగా వస్తున్నాయని మెడిసిన్ తీసుకుంటున్నారా?.. అయితే, డేంజర్లో పడ్డట్టే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం