Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతున్న ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్ట్ 31) ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో, రామ్ చరణ్ సిద్ధరామయ్యను శాలువాతో సత్కరించారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని తెలుస్తోంది. అయితే, రామ్ చరణ్, సిద్ధరామయ్యల భేటీ కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. రామ్ చరణ్ తన రాబోయే చిత్రాల గురించి, ముఖ్యంగా ‘పెద్ది’ (Peddi) గురించి సీఎంకు వివరించినట్లుగా సమాచారం. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మెగా ఫ్యామిలీ (Mega Family)కి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
Also Read- Nandamuri Balakrishna: నాకు ఈ లెక్కలన్నీ గుర్తుండవ్.. అవన్నీ అభిమానులే గుర్తు పెట్టుకుంటారు
మైసూర్‌లో ‘పెద్ది’ షూటింగ్
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్లిన రామ్ చరణ్.. అక్కడకు సీఎం సిద్ధరామయ్య వచ్చారని తెలిసి ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధంతో పాటు, ఆయన ఫ్యామిలీకి చెందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దేశవ్యాప్త, అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో.. ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌చరణ్ ఈరోజు మైసూర్‌లో నన్ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు అని సీఎం సిద్ధరామయ్య కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు.
సాంగ్ చిత్రీకరణలో..
‘పెద్ది’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మైసూర్‌లో జానీ మాస్టర్ ఒక భారీ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. ‘పెద్ది’ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.
Also Read- Amitabh Bachchan: మరోసారి బాలయ్యకు హ్యాండిచ్చిన అమితాబ్.. ఫంక్షన్‌కు పిలిస్తే రాకుండా ఏం చేశారంటే?
పవన్ కళ్యాణ్‌తో సత్సంబంధాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)తో కర్ణాటక ముఖ్యమంత్రికి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తనకున్న పరిచయంతో, ఇటీవల కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడం, ప్రజలపై దాడి చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ఏనుగులను తీసుకొచ్చారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడానికి అంగీకరించింది. ఇందులో మొదట నాలుగు ఏనుగులను (కృష్ణ, శివమొగ్గ అభిమన్యు, దేవ, రంజన్) పవన్ కళ్యాణ్ సమక్షంలో అప్పగించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టడం, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ఏనుగులను తీసుకురావడంపై అభినందనలు అందుకున్నారు.
ಪೆದ್ದಿ ಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿರುವ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟ ರಾಮಚರಣ್ ಅವರು ಇಂದು ಮೈಸೂರಿನಲ್ಲಿ ನನ್ನನ್ನು ಭೇಟಿಯಾಗಿ ಕೆಲಹೊತ್ತು ಮಾತುಕತೆ ನಡೆಸಿದರು. pic.twitter.com/wwmYlNOA6N
— Siddaramaiah (@siddaramaiah) August 31, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు