Airtel offers: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏఐ ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్, చాట్ జీపీటీ తరహా యాప్ అయిన ‘పర్‌ప్లెక్సిటీ’ (Perplexity) ప్రీమియం వెర్షన్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 12 నెలల పాటు ‘పర్‌ప్లెక్సిటీ ప్రో’ (Perplexity Pro)’ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. దీని ద్వారా 360 మిలియన్ల ఎయిర్ టెల్ కస్టమర్లు.. ఏడాదికి రూ.17000 విలువైన సేవలను ఫ్రీగా అందుకోనున్నారు.
ఎలా పొందాలి?
పర్‌ప్లెక్సిటీ ప్రో సేవలను పొందేందుకు వినియోగదారులు ముందుగా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ మెుబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత.. రివార్డ్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ పర్‌ప్లెక్సిటీ ప్రో బ్రౌజ్ చేసి ‘క్లెయిమ్ నౌ’పై క్లిక్ చేయాలి. ప్రొసిడ్ ఆప్షన్ పై కూడా క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే మీ మెుయిల్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దానిని ఉపయోగించి.. పర్‌ప్లెక్సిటీ ప్రోలో లాగిన్ అవ్వవచ్చు. తద్వారా 12 నెలల పాటు ఏఐ సేవలను ఉచితంగా పొందవచ్చు.
Airtel is thrilled to announce a first-of-its-kind partnership in India with @perplexity_ai, poised to unlock the immense potential of GenAI for its customers. Through this groundbreaking collaboration, all 360 million Airtel customers will receive a complimentary 12-month… pic.twitter.com/tSKhmQwPFt
— Bharti Airtel (@airtelnews) July 17, 2025
యూజర్ల ప్రయోజనాలు
పర్‌ప్లెక్సిటీ సంస్థతో ఎయిర్ టెల్ కుదుర్చుకున్న తాజా ఒప్పందం కారణంగా ఆధునాతన ఏఐ సాధనాలు.. ఉచితంగా వినియోగదారులకు లభించనున్నాయి. పర్‌ప్లెక్సిటీ ప్రో ద్వారా రోజుకు 300 వరకు ఏఐ ఆధారిత సెర్చ్‌లు చేయవచ్చు. సమాచార సేకరణ విషయంలో సాధారణ వినియోగదారులు, ప్రొఫెషనల్స్‌కు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. GPT-4.1, క్లాడ్ 4.0 సానెట్, జెమినీ 2.5 ప్రో, మరియు గ్రోక్ 4 వంటి అధునాతన ఏఐ మోడల్స్ ను యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. DALL-E, ఫ్లక్స్ వంటి సాధనాలతో టెక్స్ట్ ఆధారంగా చిత్రాలను సృష్టించవచ్చు. రిపోర్ట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, వెబ్ యాప్‌లు వంటి సృజనాత్మక ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి పర్‌ప్లెక్సిటీ ల్యాబ్స్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
Also Read: American Woman: అమెరికా అమ్మాయి.. పాక్ అబ్బాయి.. ఇది మామూలు లవ్ స్టోరీ కాదు భయ్యో!
పర్‌ప్లెక్సిటీ ఏఐ అంటే ఏమిటి?
పర్‌ప్లెక్సిటీ ఒక ఏఐ ఆధారిత సెర్చ్ అండ్ ఆన్సర్ ఇంజన్. 2022లో అరవింద్ శ్రీనివాస్, డెనిస్ యరాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలచే ఇది స్థాపించబడింది. ఇది సాంప్రదాయ సెర్చ్ ఇంజన్‌లకు భిన్నంగా.. వెబ్‌లో లింక్‌ల జాబితాను అందించడం కాకుండా అత్యంత కచ్చితత్వంతో విశ్లేషణాత్మక సమాధానాలను అందిస్తుంది. విద్య, వృత్తిపరమైన అవసరాలు, రోజూవారి కార్యక్రమాలకు అనుగుణంగా పర్‌ప్లెక్సిటీ ఏఐను రూపొందించారు. స్టూడెంట్స్, గృహిణులు, ప్రొఫెషనల్స్, సాధారణ వినియోగదారులు ప్రశ్న రూపంలో ఏ సమాచారాన్ని అడిగిన ఇది అర్థవంతంగా కచితత్వంతో కూడిన ఆన్సర్లు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.