Ambati Rambabu: ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల జరిగే మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరు ఘాటుగా స్పందిస్తే దానికి దీటుగా మరొకరు బదులిస్తుంటారు. ఈ క్రమంలోనే నిడదవోలు నియోజకవర్గ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేది మేమేనంటూ బెదిరింపులకు దిగడంపై ఘాటు విమర్శలు చేశారు. అయితే దీనికి వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ ఏమన్నారంటే?
అమరజీవి జలధార పథకం శంఖుస్థాపనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తామంటూ బెదిరిస్తున్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘భవిష్యత్తులో మేం వస్తాం.. వచ్చి ఏం చేస్తామంటే’ అని ఇక్కడున్న వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పవన్ అన్నారు. ‘వచ్చినప్పుడే మీరు ఏమీ పీకలేదు.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు’ అంటూ ఘాటుగా మండిపడ్డారు.
అంబటి కౌంటర్..
అయితే పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ నేత అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దానికి ఘాటైన కౌంటర్ ను జత చేశారు. ‘మేము పీకలేకపోయాం. మీరు వచ్చారు, వచ్చి పీకండి. సిద్ధంగా ఉన్నాం పీకించుకోవడానికి!’ అని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అంబటి వ్యాఖ్యలకు జనసేన మద్దతుదారులు వ్యగ్యంగా సమాధానం ఇస్తున్నారు. ‘151 సీట్ల నుంచి 11 సీట్ల వరకూ పీకేసాం కదా.. ఇంకా చాలలేదా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మేము పీకలేకపోయాం
మీరు వచ్చారుగా , వచ్చి పీకండి !
సిద్ధంగా ఉన్నాం పీకించుకోడానికి !@PawanKalyan pic.twitter.com/XshnTaWOBn— Ambati Rambabu (@AmbatiRambabu) December 20, 2025
డైవర్షన్ పాలిటిక్స్
మరోవైపు వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు సైతం పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ‘తనను పట్టించుకోవడం లేదన్న అక్కసుతో పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుండటంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు ప్రశ్నించరు? దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?’ అంటూ అశోక్ బాబు నిలదీశారు.
Also Read: Sonia Gandhi: గాంధీ పేరు మార్పు.. తొలిసారి పెదవి విప్పిన సోనియా.. ప్రధానికి సూటి ప్రశ్నలు
‘కాలుకు కాలు తీస్తా’
నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీపై మరికొన్ని కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమి చేయలేకపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. బెదిరింపులకు దిగేవారికి యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్ ట్రీట్ మెంట్ ఇస్తే సెట్ అవుతారని పవన్ అన్నారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీసేస్తేనే వారికి బుద్ధి వస్తుందన్నారు. ‘సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని విదేశాల్లో దాక్కున్నా వారికి కూడా చెబుతున్నా. ‘గీత దాటి మాట్లడవద్దు. రౌడీయిజం చేస్తామంటే తాటతీస్తాం’ అని పవన్ కళ్యాన్ సంచలన కామెంట్స్ చేశారు.

