Chandrababu: డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయో అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. రెండు మూడ్రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయని అధికారికంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. 175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు చేశారు. ‘ పేదలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ (Super Six) పథకాలు ఇస్తామని చెప్పాం. మరో రెండు, మూడు రోజుల్లోనే తల్లికి వందనం (Thalliki Vandanam) పథకం అమలు చేస్తాం. ఆ తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava) అమలు చేస్తాం. ఆగష్టు-15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని (Free Bus) ప్రారంభిస్తున్నాం. దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకెళుతున్నాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
Read Also- YS Jagan: అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్!
విజన్-2047
‘ఈనెల 12వ తేదీకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. స్వర్ణాంధ్ర విజన్-2047కు శ్రీకారం చుట్టాం. దీని ఉద్దేశం పేదరికం లేని సమాజం. ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా విజన్-2047. మనం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎనామీలో ముందుకు వెళ్తున్నాం. వచ్చే సంవత్సరానికి 3వ స్థానానికి వస్తాం. చైనా, అమెరికా వంటి దేశాలతో మనం పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్ల కొంత ఉపయోగకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. 450 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వాడుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటాం. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్‌తో విజన్-2047 డాక్యుమెంట్ తయారైంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసి దీనికోసం పనిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కృషి చేయాలి. ప్రజాసమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. 175 నియోజకవర్గాల్లో స్వర్ణ నియోజకవర్గాలను గుర్తించే పనిలో ఉన్నాం. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
యాక్షన్ ప్లాన్ రెడీ..
ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అలాగే మనం రాష్ట్రంలో స్వచ్చాంధ్ర అమలు చేస్తున్నాం. డీప్ టెక్‌తో టెక్నాలజీ బాగా పెరిగింది. వాట్సాప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయి. 2 నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సాప్‌లో ఉంటాయి. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఆదాయం పెరగాలి.. ఆరోగ్యం, ఆనందం ఉండాలి. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. విజన్ డాక్యుమెంట్ తయారైంది. 26 జిల్లాల్లో రోడ్ మ్యాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయం తక్కువ ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ఆక్వా, డైరీ ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. పరిశ్రమలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో అనుకూలమైన సర్వీస్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. హాస్పిటల్, టూరిజం ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలి’ అని చంద్రబాబు సూచించారు.
Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
45 ఏళ్ల రాజకీయ జీవితంలో..
‘ వ్యవసాయ రంగాన్ని డెయిరీ, ఆక్వాకల్చర్, హార్టీకల్చర్ డామినేట్ చేస్తున్నాయి. వివిధ జిల్లాల్లో పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. 175 నియోజకవర్గాల్లో ఎం.ఎస్.ఎం.ఈ పార్కులు మరో సంవత్సరంలో ప్రారంభిస్తాం. సేవారంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, సచివాలయం స్థాయిల్లో అభివృద్ధి జరగాలి. టెక్నాలజీని సాధ్యమైనంత వరకు అందిపుచ్చుకోవాలి. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్‌ను అమలు చేస్తుంది. 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలకు ఆఫీసు ఇవ్వడంతో పాటు 9మంది అధికారులను ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తున్నాం. సచివాలయం నుండి రాష్ట్రస్థాయి వరకు విజన్-2047 అమలవుతుంది. దీనిలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తాం. నిర్ధిష్టమైన సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రభుత్వం మారడంతో 2021లో పూర్తయిన పోలవరం నేడు 2027 నాటికి జాతికి అంకితం చేయబోతున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.
Read Also- Andhra Pradesh: ఏపీలో రోజురోజుకూ గాడి తప్పుతున్న లా అండ్ ఆర్డర్.. ఎందుకిలా?
Read Also- Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్