Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా, అనూహ్యంగా మరోసారి స్వల్ప వాయిదా అంటూ రెండు రోజుల క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్వల్ప వాయిదా అని చెప్పారు కానీ, విడుదల తేదీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుపుతూ, రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా ఈ జూన్ నెలలోనే రాబోతోంది. జూన్ 26వ తేదీని ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ డేట్‌కైనా ‘వీరమల్లు’ థియేటర్లలోకి దిగుతాడా? లేదంటే మరోసారి వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
Also Read- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్
ఈ అనుమానాలకు తెర పడాలంటే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఆయన కనుక ఒక మాట అంటే మాత్రం.. ఇక ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఈసారి మాత్రం పక్కాగా థియేటర్లలోకి తీసుకు వస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఒకవేళ జూన్ 26న ఈ సినిమా రావడం పక్కా అయితే మాత్రం, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మరోసారి వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, జూన్ 27న ‘కన్నప్ప’ను థియేటర్లలోకి తీసుకురావడానికి మంచు విష్ణు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆ సినిమా విషయంలో అనుకున్నంతగా బిజినెస్ జరగలేదనే టాక్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కారణం చూపించుకోవడానికి ‘హరి హర వీరమల్లు’ విడుదల కూడా మంచు విష్ణుకి హెల్ప్ అవుతుంది.
Also Read- NTR: నాడు ‘నందమూరి’ నాటిన మొక్క.. నేటికీ సిరుల పంట
ఇక ఇటీవల ‘హరి హర వీరమల్లు’ విడుదల అనగానే థియేటర్ల బంద్ అంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ సమస్యను లేవనెత్తారు. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటైనట్లుగా తెలుస్తుంది. ఈ వారంలో ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి.. నిజంగా జూన్ 26న ‘వీరమల్లు’ థియేటర్లలోకి దిగడం పక్కా అయితే మాత్రం.. థియేటర్లకు కూడా మంచి రోజులు వచ్చినట్లుగానే భావించవచ్చు. ఎందుకంటే, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. థియేటర్లకు పూర్వ వైభవం తీసుకు రాగల సత్తా ఆయన సినిమాకు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు