YS Jagan Warning
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య చోటుచేసుకున్న వరుస పరిణామాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టులను భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?’ అని ఎక్స్ వేదికగా జగన్ ప్రశ్నించారు.

Kommineni Arresrt

గుర్తు పెట్టుకోండి!
‘ ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై (గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును (Kommineni Arrest) తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి’ అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also- Amaravati: అటు మహిళ కమిషన్‌కు ఫిర్యాదు.. ఇటు రంగంలోకి బాబు, పవన్

ఎందుకు.. ఏమైంది?
అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిబేట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నడిచింది. దీంతో ఈ ఇద్దరిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదు చేశారు. పలుచోట్ల సాక్షి దినపత్రిక, టీవీ కార్యాలయాలను ముట్టడించారు కూడా. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కాస్త సాక్షి, వైసీపీ వర్సెస్ మహిళలు, టీడీపీగా పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావును ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. ఇప్పటికే అటు కృష్ణంరాజు, ఇటు కొమ్మినేని ఇద్దరూ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ అరెస్ట్ చేయడం ఏమిటి? అసలు ఆయన మాట్లాడిన మాటలకు సాక్షికి సంబంధమేంటి? మధ్యలో వైసీపీ ఏం చేసింది? ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారు? అన్నది వైసీపీ నేతల ప్రశ్న. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా పై విధంగా ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also- Andhra Pradesh: ఏపీలో రోజురోజుకూ గాడి తప్పుతున్న లా అండ్ ఆర్డర్.. ఎందుకిలా?

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!