Amaravati Issue
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Amaravati: అటు మహిళ కమిషన్‌కు ఫిర్యాదు.. ఇటు రంగంలోకి బాబు, పవన్

Amaravati: అమరావతిని వేశ్యల రాజధానిగా ‘సాక్షి టీవీ’ డిబేట్‌లో అభివర్ణించటంపై తెలుగు మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెండ్రోజులుగా ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు చేపడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు నల్ల చీరలు ధరించి గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అటు అమరావతి జేఏసీ, రాష్ట్ర మహిళ సంఘాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను కలిశారు. సాక్షి టీవీలో ప్రసారమైన అమరావతి రైతులను కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజాను (Rayapati Sailaja) కలిసి ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు, కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ఇద్దరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నామని, దీనిపై రెండు రోజులు ముందే కార్యచరణ ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ పట్ల ఇలా చేయటం మాట్లాడటం వారికి తగదని.. ఈ కేసును సుమోటోగా తీసుకుని కచ్చితంగా వారికి నోటీసులు జారీ చేస్తామని మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అటు మహిళా సంఘాలు, ఇటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.

Read Also- NTR: నాడు ‘నందమూరి’ నాటిన మొక్క.. నేటికీ సిరుల పంట

క్షమించరాని నేరం

ఈ వ్యవహారంపై ఫేస్‌బుక్ వేదికగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్రంగా స్పందించారు. ‘ ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన  వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్

అవమానమే కదా?
‘ గౌతమ బుద్దుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి. అలాంటి బౌద్ధం విలసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానెల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు. అంటే అక్కడ ఉన్న- ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా? ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతిపై ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్లే’ అని ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డారు. మొత్తానికి చూస్తే ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. మరోవైపు వైసీపీ మాత్రం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పింది. ఇప్పుడు కూటమి పార్టీలు, మహిళా నేతలు మాత్రం ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏకంగా బాబు, పవన్ ఇరువురూ రంగంలోకి దిగడంతో ఏం జరగబోతోంది? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ