Hyderabad Crime: చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్‌లో తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 2.30 గంటల సమయంలో చర్లపల్లి సెక్షన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద గూడ్స్ రైలు లోకో పైలట్ వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. రైల్వే పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
Also Read: Hyderabad: గంజాయి మత్తులో ఓ కిరాతకుడు.. చిన్నారిపై అఘాయిత్యం.. ఎక్కడంటే?
ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్, చర్లపల్లి, ఏఎస్‌ఐపీఎఫ్ బిఎస్.రావు, జీఆర్‌పీ సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్, మాదవ్ (ఎస్‌ఐ) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పట్టాల మధ్యలో మూడు మృతదేహాలు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డి గుర్తించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు భావిస్తున్నారు.
194 ప్రకారం కేసు నమోదు
మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా జాయింట్ ఆబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీఆర్‌పీ సికింద్రాబాద్ క్రైమ్ నంబర్ 57/2026 కింద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: Hyderabad Car Scam: రూ.26 వేలకే కారు.. ఎగబడ్డ జనం.. చివరికి ఊహించని మలుపు!

