Hyderabad: గంజాయి మత్తులో ఓ యువకుడు మృగంలా మారాడు. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆమె సోదరుడి ముందే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం సైదాబాద్ (Hyderabad) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కాలనీలో నివాసముంటున్న భార్యాభర్తలు కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ఓ ఎనిమిదేళ్ల కూతురితోపాటు ఓ కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్లినపుడు పిల్లలు ఇంటి వద్దనే ఉండేవారు. ఇటీవల అలానే ఇంటి వద్ద ఉన్న పిల్లలను అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువకుడు ఇంట్లోకి పిలుచుకున్నాడు.
Also Read: Crime News: కాలేజీ నుంచి ‘కోటి’ లూటీ.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పనేనా…?
అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యం
అప్పటికే గంజాయి సేవించి ఉన్న ఆ కిరాతకుడు సోదరుడి ముందరే అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే ఇద్దరినీ చంపేస్తానని భయపెట్టాడు.కాగా, బాలిక అస్వస్థతకు గురి కావటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా బాధితురాలి సోదరుడు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.
Also Read:Nalgonda Crime: నల్గొండలో దారుణ ఘటన.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య!
వైద్య ఆరోగ్యశాఖ పోస్టింగ్ ఆర్డర్లు ఎప్పుడు..? ప్రమోషన్లు పూర్తైనా లేట్ ఎందుకు?
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని సివిల్ సర్జన్ పోస్టింగ్ ఆర్డర్ల ఎందుకు ఆలస్యమవుతున్నాయని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆలస్యం వలన డిప్యూటీ సివిల్ సర్జన్ల పోస్టింగ్ ఆర్డర్ల జారీ కూడా నిలిచిపోయినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, ట్రెజరర్ డాక్టర్ రవూప్ లు మాట్లాడుతూ.. పదోన్నతి ప్రక్రియ చాలాకాలం క్రితమే పూర్తయినప్పటికీ, ఇప్పటికీ ఆర్డర్లు విడుదల కాలేకపోవడం వలన డాక్టర్ల హక్కులు, వారి ఉత్సాహం దెబ్బతింటోందన్నారు.
ఉన్నతాధికారులు నిర్లక్ష్య ధోరణి
దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది జీతాల చెల్లింపులో జరుగుతున్న నిరంతర ఆలస్యాల వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. టీవీవీపీ ఆ సంస్థను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తూ, 010 బడ్జెట్ కిందకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. దురదృష్టవశాత్తూ, పబ్లిక్ హెల్త్ నుండి టీవీవీకి కి మారిన సుమారు 80 ఆస్పత్రులకు ఇప్పటికీ తగిన సిబ్బంది లేరన్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Also Read: Crime News: విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. చిట్లిపోయిన పుర్రె ఎముక.. ఎక్కడంటే..?
