Medchal District: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ లోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో మూడు అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు నొటిఫికేషన్ ను ఎవరైన అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.
Also Read: Medchal District: మున్సిపాలిటీ ఎన్నికలకు మోగిన నగారా.. నామినేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నామినేషన్ల స్వీకరణకు భారీ స్పందన
మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఎల్లంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ 3,బీజేపీ 1 నామినేషన్ దాఖలు చేయగా, ముడిచింతలపల్లి 5 కాంగ్రెస్ 5, బిఆర్ఎస్ 3, బీజేపీ 1,అలియాబాద్ మున్సిపల్ లో కాంగ్రెస్ 7, బి ఆర్ఎస్ 5,బీజేపీ 2,జనసేన 2 మొత్తం మీద మూడు మున్సిపల్ కలిపి 29 నామినేషన్ వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రచాంతంగా కొనసాగుతుందని ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

