Madhira Municipality: మధిర మున్సిపాలిటీలో వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిపాదనలకు సంబంధించి భౌగోళిక పరిస్థితులను అధికారులతో కలిసి ఆయన ఉప ముఖ్యమంత్రి పరిశీలన చేశారు. మధిర మున్సిపాలిటీ(Madhira Municipality)ని వైరా నది వరద ముంపు నుంచి శాశ్వత ముగా విముక్తి కల్పించేందుకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వరద ఏ స్థాయిలో వస్తుంది.. రిటైనింగ్ వాల్ ఎత్తు ఎంత ఉండాలి? అని అధికారులను ఆయన అడిగారు. వైరా నడిపైన మధిర నుంచి మదుపల్లి వరకు బ్రిడ్జి నిర్మాణం గురించి అధికారులను అడిగారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణంకు సంభందించి శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని చెప్పారు. రాజకీయ నాయకుల ఆలోచనల కన్నా.. టెక్నికల్ సర్వే ఫీజిబిలిటీ ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చెప్పారు.
డిప్యూటీ సీఎంకి సిపిఐ వినతి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు, యంగల ఆనందరావు లు మండల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా బోనకల్లు మండల కేంద్రంలో సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డును నూతన బస్టాండ్(BUS Stand) గా ఏర్పాటు చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ఐనా బోనకల్ కేంద్రంలో నూతన బస్టాండ్ ని ఏర్పాటు చేయడం వల్ల అటు జగ్గయ్యపేట ఇటు ఖమ్మానికి దగ్గరలో ఉంటుందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
మోటమర్రి గ్రామంలో స్మశాన వాటిక సిసి రోడ్ ఏర్పాటు చేయాలని, బోనకల్లో పశువుల సంతను ఏర్పాటు చేయాలని కోరారు. బ్రాహ్మణపల్లి నుంచి రాపల్లికి రోడ్డు ఏర్పాటు చేస్తే రెండు గ్రామాల రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయాలని కోరారు . మండల కేంద్రంలో ఆర్వోబీకి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, ముష్టికుంట్లలోని పల్లె దవాఖాన నూతన బిల్డింగును మంజూరు చేయాలని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు జక్కుల రామారావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు, ఆ కెన పవన్, మండల నాయకులు వంగాల కృష్ణ వంగాల బ్రహ్మం మందా కృష్ణారావు, మరీదు మల్లయ్య, మరీదు నాగేశ్వరరావు, మోటమర్రి, కలకోట గ్రామాల పాలకమండలి సభ్యులు తదితరులున్నారు.
Also Read: Short Film Contest: టాలెంటెడ్ అప్ కమింగ్ దర్శకులకు మంచు విష్ణు బంపరాఫర్.. ఏం చెయ్యాలంటే?

