Maoists Surrender: ములుగు జిల్లా పోలీసులు మరియు CRPF అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత CPI (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు పార్టీ సభ్యులు ఈ రోజు ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ బట్ ఐపీఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. జనజీవన స్రవంతిలో కలిసిన వీరు CPI (మావోయిస్టు) పార్టీ సభ్యుల హోదాలో మద్దేడు ఏరియా కమిటీ మరియు ఆకాష్ టీంలో పనిచేశారు.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఏకంగా 37 మంది లొంగుబాటు.. డీజీపీ కీలక ప్రకటన
రూ. 25,000/- పునరావాస ఆర్థిక సహాయం
వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా రూ. 25,000/- పునరావాస ఆర్థిక సహాయం గౌరవ ఏఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. మావోయిస్టు సంస్థ బలహీనపడుతున్న నేపథ్యంలో, క్రింది స్థాయి క్యాడర్లు నాయకత్వంపై అసంతృప్తితో రహస్య జీవితం వదిలి, కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తూ, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి నగదు రివార్డు, వైద్య సేవలు, పునరావాస సహాయం, సమాజంలో తిరిగి స్థిరపడటానికి పూర్తి మద్దతు అందించడం జరుగుతుందన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమంటూ వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ మరియు వివిధ మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.
లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరాలు
1. కుడియం పాండు @ కార్తీక్ S/o భీమా, వయసు: 23 సంవత్సరాలు, ST-గొత్తికోయ, R/o బంధిపార (V), అంగనిపల్లి పంచాయతీ, మద్దేడు PS పరిధి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం. హోదా పార్టీ సభ్యుడు, మద్దేడు ఏరియా కమిటీ 2. ముచకి మంగళ్ S/o జోగా, వయస్సు: 25 సంవత్సరాలు, ST-గొత్తికోయ, R/O పెద్దభట్టిగూడెం గ్రామం, టెర్రమ్ PS పరిధి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం. హోదా: పార్టీ సభ్యుడు, 2వ CRC, CPI మావోయిస్టు. ఈ కార్యక్రమంలో CRPF అసిస్టెంట్ కమాండెంట్ ప్రశస్త్, వెంకటాపురం సిఐ రమేష్, వాజేడు ఎస్సై సతీష్, వెంకటాపూర్ ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు మరో భారీ షాక్.. పెద్ద సంఖ్యలో సరెండర్.. ఎక్కడంటే?

