Why Didn't Mahindra Call Me Ramcharan
Cinema

Funny Tweet: మహీంద్రా నన్ను ఎందుకు పిలవలేదన్న రామ్‌చరణ్‌

Why Didn’t Mahindra Call Me Ramcharan : గ్లోబల్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌, ప్రముఖ బిజినెస్‌మెన్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్‌ మహీంద్రా మధ్య ఫన్నీ చాటింగ్ జరిగింది. సుజీత్‌ పెళ్లికి తనను ఎందుకు పిలవలేదని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించాడు రామ్‌చరణ్‌. దీంతో ఆనంద్‌ మహీంద్రా అయ్యయ్యో..మర్చిపోయానంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఇంతకీ అసలు మ్యాటర్‌ ఏంటంటే.. తెలంగాణలోని జహీరాబాద్‌ ముఖచిత్రాన్ని మహీంద్రా ఎలా మార్చాడో ఫ్యాక్టరీతో పాటు.. ఓ వీడియోని రిలీజ్‌ చేశారు.

జహీరాబాద్‌లో మహీంద్రా ఒక ఫ్యాక్టరీని నిర్మించడంతో పాటు లక్షలాది చెట్లను నాటాడు. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ ఏర్పాటు చేయించడంతో అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులకు పెరిగింది. అప్పటివరకు నీటి ఎద్దడి వల్ల గ్రామస్తుడు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.అతడే కాదు ఆ ఊర్లో ఉన్న ఎవరికీ పిల్లనిచ్చేందుకు చుట్టుపక్కల ఊరివాళ్లు ముందుకు రాలేదు.ఇప్పుడా నీటి సమస్య తీరిపోవడంతో ఊళ్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. సుజిత్‌ పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చారు.

Read Also : దుమ్ములేపుతున్న ఓం భీం బుష్, కలెక్షన్ ఎంతంటే..?

దీనిపై చరణ్‌ ప్రశంసలు కురిపిస్తూ..ఆనంద్‌ మహీంద్రా, సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు. నేను అక్కడికి దగ్గర్లోనే ఉంటాను.జహీరాబాద్‌లో నా ఫ్రెండ్స్‌ను కలిసి ఎంజాయ్‌ చేసేవాడిని. ఏదేమైనా మీరు చేసింది చాలా గొప్ప పని అని మెచ్చుకున్నారు. ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ..నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు నేను గందరగోళంలో ఉన్నాను.అందువల్లే పెళ్లికి ఆహ్వానించలేకపోయాను.

ఇప్పుడేమో మీ ట్రైనింగ్ కారణంగా నా డ్యాన్స్‌ని ఇంప్రూవ్‌మెంట్‌ చేసే పనిలో ఉన్నాను. మా యాడ్‌ పట్ల స్పందించినందుకు థ్యాంక్స్‌..ఇది ఎంతో సానుకూల ప్రభావం చూపుతుందని నేను భావిస్తున్నాను. ఈసారి నేను మిస్‌ అవ్వాలనుకోవడం లేదు. అందుకే అడ్వాన్స్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశాడు. దీనికి చరణ్‌ థాంక్యూ, త్వరలోనే కలుద్దామంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఛాటింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ