Om Bheem Bush is Gathering Dust, How Much Is The Collections : హీరో శ్రీవిష్ణుతో పాటు కమెడియన్‌లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ మూవీకి హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. చిన్న మూవీగా రిలీజైన ఈ మూవీ ఊహించని రీతిలో అనూహ్యంగా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తూ..పెద్ద సినిమాలను సైతం హౌరా అనిపించేలా చేస్తూ తగ్గెదెలే అంటూ దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో ఆద్యంతం ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేశాయనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ మూవీ కూడా అంతే జోష్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.
ఈ మూవీ స్టోరీ మ్యాటర్ కొస్తే.. భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న దెయ్యం ఎవరు? అందరిని ఆ దెయ్యం ఎలా ఆడుకుంది. దెయ్యాన్ని తరిమెందుకు ఈ ముగ్గురు ఏం ప్లాన్ వేశారు? అనేదే ఈ సినిమా కథ. రెండు రోజుల కలెక్షన్స్‌ను చూస్తే సినిమా వరల్డ్ వైడ్‌గా బాగానే రాబడుతోంది. ఎంత కలెక్షన్స్‌ను రాబట్టిందో మనం కూడా ఓ లుక్కెద్దాం.
Read Also : ఓం భీం బుష్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఇక భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని క్రియేట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సామజవరగమన బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్‌తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించాడు. ఈ మూవీ రెండు రోజుల రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల+ గ్రాస్‌ని వసూలు చేసింది. సినిమా తొలిరోజు 4.6 కోట్లు రాబట్టగా, రెండో రోజు 5.84 కోట్లు వసూలు చేసింది. ఓం భీమ్ బుష్ అమెరికాలో అర మిలియన్ మార్కును దాటింది. ప్రస్తుతానికి..ఈ ప్రాంతంలో ఈ మూవీ 260 వేల+ గ్రాస్‌ని వసూలు చేసింది. ఈరోజు కలెక్షన్స్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ మూవీ పడిందనే చెప్పాలి.