IND vs NZ 1st ODI: భారతీయ క్రికెట్ అభిమానులకు అలరించడానికి మరో క్రికెట్ సమరం షురూ కాబోతోంది. బలమైన జట్టు న్యూజిలాండ్‌ను భారత్ ఢీకొట్టబోతోంది. రేపటి నుంచి (జనవరి 11) భారత్‌లోనే ఈ సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం నాడు జరగనున్న తొలి మ్యాచ్‌కు గుజరాత్‌లోని వడోదర వేదిక (IND vs NZ 1st ODI) కానుంది. బీసీఏ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా, ఈ సిరీస్‌ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ బ్రాడ్‌కాస్ట్ చేయనుంది. ఇక, లైవ్‌స్ట్రీమింగ్ విషయానికి వస్తే, జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రసారం కానుంది.
టీ20 వరల్డ్ కప్-2026, ఐపీఎల్‌కు ముందు ఈ వన్డే సిరీస్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికకాని శుభ్‌మన్ గిల్ తిరిగి వన్డే సారధిగా మైదానంలోకి దిగబోతున్నాడు. ఇక, ఈ సిరీస్ ముగిసిన తర్వాత జులై నెల వరకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియా జెర్సీలో కనిపించరు. ఎందుకంటే, అప్పటిదాకా మళ్లీ వన్డేలు లేవు. వీరిద్దరూ అంతర్జాతీయ టీ20, టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైరయ్యి, కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. నెట్ ప్రాక్టీస్‌లో కూడా ఆకట్టుకున్నారు.
Read Also- Minister Komatireddy: నన్ను ఏమైనా అనండి.. మహిళా అధికారిపై రాతలు బాధాకరం.. నోరువిప్పిన మంత్రి కోమటి
ఇరు జట్ల ట్రాక్ రికార్డ్ ఇదే
భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 120 వన్డే మ్యాచ్‌లలో తలపడ్డాయి. అత్యధికంగా భారత్ 62 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 50 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, ఏడు వన్డేలలో ఫలితం తేలలేదు.
ఇరు జట్లు ఇవే
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, రిషబ్ పంత్, యశ్వస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా.
న్యూజిలాండ్: డేవోన్ కాన్వే (వికెట్ కీపర్), విల్ యంగ్, హెన్రీ నికోలస్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మెచెల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జాష్ క్లార్సన్, మిచెల్ రే, కైల్ జమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియాన్ క్లార్క్, జాయ్‌డెన్ లెన్నోక్స్.

