ACB Rides: అధికారికంగా సాయ పడేందుకు లంచం తీసుకున్న తహసిల్దార్(MRO) తోపాటు అతనికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ(ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి(kanmareddy) జిల్లా నాగిరెడ్డి(nagireddy Peta) పేట మండల తహసిల్దార్ గా యార్లగడ్డ శ్రీనివాస్ రావు(Yarlagadda Srinivas Rao) విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి పేర ఉన్న వ్యవసాయ భూమిని తన పేర మార్చాలని దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి నివేదికను అధికారులకు పంపించాలని కోరాడు.
Also Read: Gongidi Sunitha: మేము కన్నెర్ర చేస్తే గ్రామాల్లో తిరగలేవు జాగ్రత్త: గొంగిడి సునీత ఫైర్..!
50వే రూపాయలు
ఈ పని చేసి పెట్టటానికి శ్రీనివాస్ రావు లంచం డిమాండ్ చేశాడు. నేరుగా డబ్బు తీసుకోకుండా చిన్నూరి అజయ్(Chinnuri Ajay) అనే ప్రైవేట్ వ్యక్తికి డబ్బు ఇవ్వాలని సూచించాడు. ఈ క్రమంలో మంగళవారం చిన్నూరి అజయ్ లంచం డబ్బు 50వే రూపాయలను తీసుకుంటుండగా అప్పటికే అందిన సమాచారంతో మాటు వేసిన ఏసీబీ(ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో శ్రీనివాస్ రావు చెప్పినందునే ఆ డబ్బు తీసుకున్నట్టు అజయ్ చెప్పటంతో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: TVK – congress: డీఎంకే ముందు కాంగ్రెస్ కీలక డిమాండ్.. విజయ్ పార్టీ వైపు హస్తం పార్టీ చూస్తోందా?

