Gongidi Sunitha: మీ పద్ధతి మార్చుకోండి.. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది.. జనం బాట పేరుతో బిఆర్ ఎస్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత(Sunitha) హెచ్చరించారు. మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, టీఎస్పీఎస్ మాజీ సభ్యురాలు సుమిత్రా నందుతో కలిసి సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కవిత బిఆర్ ఎస్ పార్టీ పైన,బిఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ ను మానసిక క్షోభ కు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎవరో ఆడిస్తే కీలు బొమ్మ గా మారిందన్నారు. మీరు స్వతహాగా జాగృతి పెట్టుకొని ఎవరో ఆడిస్తే మంచిది కాదు.. తెలంగాణ జాతి పిత కేసీఆర్ ను క్షోభకు గురి చేస్తే మంచిది కాదు.. ఎవరో మీ వెనుక. ఉంది ఆడిస్తే మీరు ఆట ఆడుతున్నట్లు అందరికీ తెలుసు,అదే చర్చ జరుగుతోంది.. నిన్న అసెంబ్లీ బహిష్కరణ చేస్తే దానిపై కూడా ఏదేదో మాట్లాడారు.. ఎవరు చెప్తే శాసన సభ బహిష్కరణ చేస్తారో పార్టీలో మీకు తెల్వదా? అని అన్నారు.
మనస్పూర్తిగా రాజీనామా చేయలేదా?
మీరు నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేస్తే ఎందుకు పదవిలో కొనసాగారు.. మీరు మనస్పూర్తిగా రాజీనామా చేయలేదా?మా సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే మీరు శాసన మండలి కి ఎందుకు వెళ్ళారు.. మీ దగ్గరకు అంగన్వాడీలు,ఆయా ,చాలా మంది వస్తారు అంటున్నావు.. మరి శాసన మండలిలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు.. మీరు ఇవాళ కంటతడి పెట్టారు, పార్టీలో మీరు ఎన్ని పదవులు ఇప్పిచ్చారో అందరికీ తెలుసు.. అధ్యక్షుడు వద్ద మీకు ఉన్న చనువు ఎవరికిలేదు.. మీకు నచ్చిన వారికి పదవులు ఇప్పించుకున్నారు.. ఎంపీగా గెలిచి 9మంది ఎమ్మెల్యేలను గెలిచారు అంటున్నారు.. అయితే స్థానికంగా ఎమ్మెల్యే లుగా ఉంటే ఎంపీలు గెలుస్తారు.. బిఆర్ఎస్ మార్చినప్పుడు నాకు చెప్పలేదు అంటున్నారు మరి మీరు ఎందుకు భారత జాగృతి నీ ఎందుకు ఏర్పాటు చేశారు.. మీరు ఎంపీగా ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చారు.
Also Read: Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!
కంటతడి పెడితే ఎమ్మెల్సీ ఇచ్చారు
మీకంటే సీనియర్ అయిన వినోద్ కుమార్(Vinodh Kumar) కాదని మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు..పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు.అదే లేకపోతే మీరు పదవులు ఎలా ఇప్పించుకున్నారు ..ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది అని అందుకు నివాళి గా 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది.. మీరు ఎంపీగా ఓపిడిపోయి కంటతడి పెడితే ఓదార్చి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు.. మరి మండలిలో మీరు కంటతడి పెడితే మీకు ఎవరు ఇస్తారు.. ఎవరు ఓదార్చుతారు అని ప్రశ్నించారు. మీకు కోసం పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉన్నది..మీరు జైలు లో ఉన్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం మీకోసమే ఆలోచన చేశారు.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మీ గురించి ఆలోచన చేసి ఢిల్లీలోనే మకాం వేశారు.అలాంటి వాళ్ళను పట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.. వారి వ్యక్తిగత విషయాలు మండలిలో మాట్లాడుతూ నేను రూల్ ప్రకారం మాట్లాడుతున్నాను అన్నారు.
ఉద్యమకారుడిలా కనిపిస్తున్నారా?
మండలిలో మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి తప్ప పార్టీ మీద మా అధ్యక్షుడు పైన మాట్లాడారు.. బీ ఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే కవిత గ్రామాల్లో తిరగలేదు ..మా ఓపిక ను బలహీనత గా భావించొద్దు..ఉద్యమ కారులకు పదవులు ఇవ్వక వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు అంటున్నావ్..శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Rddy) కూడా వేరే పార్టీ నుంచి వచ్చారు ..ఆయన మాత్రం నీకు ఉద్యమకారుడిలా కనిపిస్తున్నారా ? అని నిలదీశారు. మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు అందరికీ తెలుసు..ఆ ఉద్యమం లో కేసీఆర్ వెంట ఆయన అడుగులో అడుగు అయి పని చేశాం.. ఉద్యమం ప్రారంభం అయ్యాక 6ఏండ్ల కు కవిత ఉద్యమంలో కి వచ్చారు.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడుతున్న సమయంలో అందరూ కలిసి వచ్చారు..పని తగ్గట్టు ఆమెకు ఎంపిగా,ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది.. కవిత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు బాధేస్తున్నాయన్నారు.

