Vande Bharat Sleeper: జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు
Vande Bharat Sleeper (Image Source: Twitter)
Travel News, లేటెస్ట్ న్యూస్

Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు.. కేంద్రం ప్రకటన

Vande Bharat Sleeper: తొలి వందే భారత్ స్లీపర్ రైలును జనవరిలోనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ నెల ద్వితియార్థంలో ప్రధాని మోదీ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండు వందే భారత్ స్లీపర్ సెట్లు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అవి విజయవంతంగా తమ ట్రయల్ రన్ ను పూర్తి చేశాయని వెల్లడించారు.

ఆ మార్గాల్లో పరుగులు..

తొలి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతి – కోల్ కతా మధ్య నడుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. ప్రతీ భారత్ స్పీపర్ లో ఏసీలు కలిగిన 16 కోచ్ లు ఉంటాయని తెలిపారు. 11 ఏసీ 3-టైర్ (11 AC 3-tier), 4 ఏసీ 2-టైర్ (4 AC 2-tier), ఒక సింగిల్ ఏసీ కోచ్ ఉంటుందని స్పష్టం చేశారు. స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ట్రావెల్ చేయవచ్చని పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో మరో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తామని.. ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్యను 12కి చేరుస్తామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

ఆ జిల్లాల వారికి ప్రయోజనం..

కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్ హౌరా – గౌహతి నగరాల మధ్య చక్కర్లు కొట్టనున్నట్లు సమాచారం. అదే జరిగితే అస్సాంలోని కమ్రూప్ మెట్రోపాలిటన్ (Kamrup Metropolitan), బొంగైగావ్ (Bongaigaon)తో పాటు పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ (Coochbehar), జల్పైగురి (Jalpaiguri), మాల్దా (Maldah), ముష్షిదాబాద్ (Murshidabad), పుర్బా బర్ధమాన్ (Purba Bardhaman), హుగ్లీ, హౌరా జిల్లాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఆయా ప్రాంతాల గుండా ఈ నూతన వందేభారత్ రైలు చక్కర్లు కొట్టనుంది.

టికెట్ ధర ఎంతంటే?

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. అస్సాంలోని గౌహతి నుంచి కోల్ కతాలోని గౌహతి వరకూ ప్రయాణించడానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,300గా ఉండనుంది. వందే భారత్ స్లీపస్ ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ.2,000, ఏసీ 2-టైర్ ధర రూ. 3,000, ఏసీ వన్ ఛార్జీ రూ.3,600గా ఉండొచ్చని సమాచారం. వందే భారత్ స్లీపర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టికెట్ ధరలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

Also Read: TG University Recruitment: తెలంగాణ వర్సిటీలో 73% ఖాళీలు.. పట్టించుకోని సర్కార్..!

వాటర్ టెస్ట్ సక్సెస్..

వందే భారత్ ట్రయిల్ రన్ సందర్భంగా నిర్వహించిన వాటర్ టెస్టును ఇటీవల కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లోని కోటా-నాగ్దా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఈ వాటర్ టెస్టును నిర్వహించినట్లు ఆయన అశ్విని వైష్ణవ్ తెలిపారు. హై స్పీడ్ రన్ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదని పేర్కొన్నారు. కాగా వీడియోను గమనిస్తే మెుత్తం నాలుగు గ్లాసుల వాటర్ ను రైలులో పెట్టారు. మూడు గ్లాస్ లను కింద పెట్టి వాటి పైన మధ్య భాగంలో మరో గ్లాసును నిలబెట్టారు. మరోవైపు రైలు వేగాన్ని సూచించే స్పీడో మీటర్ ను చూపించారు. ఈ క్రమంలో రైలు 180 కి.మీ వేగంతో దూసుకెళ్తునప్పటికీ కోచ్ లో దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గ్లాసులోని వాటర్ ఏమాత్రం కదలికలకు గురికాలేదు.

Also Read: Eluru District: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. స్తంభానికి కట్టి చితకబాదారు

Just In

01

Minister Seethakka: బొకేలు వద్దు.. బ్లాంకెట్లు తీసుకురండి.. మంత్రి సీతక్క కీలక సూచన

Rukmini: నటకిరీటి వదిలిన హారర్ కామెడీ మూవీ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు

Honey Glimpse: భయపెడుతోన్న నవీన్ చంద్ర.. ‘హనీ’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Kawasaki Z650RS: భారత్‌లో లాంచ్ అయిన కవాసాకి Z650RS.. E20 ఫ్యూయల్ సపోర్ట్‌తో