Mukkoti Ekadashi: మెదక్‌లో వైభవంగా ముక్కోటి..
Mukkoti (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Mukkoti Ekadashi: మెదక్‌లో వైభవంగా ముక్కోటి.. మంత్రి దంపతుల ప్రత్యేక పూజలు

Mukkoti Ekadashi: మెదక్ ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడిన వైష్ణవాలయాలు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు…
ఉత్తర ద్వారా దర్శనం కోసం బారులు
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) సందర్భంగా మంగళవారం మెదక్ ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుం చే ఆలయాల వద్ద క్యూ కట్టారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం వరకు ఉత్తరద్వారా దర్శనం కోసం పోటెత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా లోని వైకుంఠ పురం ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు పల్లకి మోసి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలోని రామ  మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

Read Also- Harish Rao on CM Revanth: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు నీళ్ల ద్రోహి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వరాలయాల్లో ఆయా అర్చకులు భాష్యం మధుసూదన్ చార్యులు, నరేంద్రచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, విశేష పూజలు చేశారు. ఆలయంలో వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు దీర్చారు. తెల్లవారుజామున నుంచి ఉత్తర ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నలుమూలల నుంచి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కోదండ రామాలయంలో తెల్లవారుజామునే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గోదారంగనాథ స్వామి పల్లకి సేవ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరాలయం లో స్వామి వారిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పట్టణంలోని మరకత వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో వైద్య శ్రీనివాస్,రాజు పoతులు మాణిక్యారావు ల ఆధ్వర్యంలో భజన మండలి ఆలపించిన గేయాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Read Also- Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు