Remand Prisoner Died: రిమాండ్ ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?
krishna (image source Swetcha)
కరీంనగర్, లేటెస్ట్ న్యూస్

Remand Prisoner Died: సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?

Remand Prisoner Died: గుండెపోటుతో జగిత్యాల సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి

జగిత్యాల, స్వేచ్ఛ: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో (Remand Prisoner Died) మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఖైదీ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి నిర్మల్ జిల్లాకు చెందిన కొత్వల్ కృష్ణ. అతడి వయసు 43 సంవత్సరాలు. సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో జైలులో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. విషయాన్ని తోటి ఖైదీలు గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం అందించారు.

Read Also- Women Driver Job Mela: హైదరాబాద్ మహిళలకు ఉపాధి అవకాశాలు.. సజ్జనార్ కీలక ప్రకటన

జైలు అధికారులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కొత్వల్ కృష్ణను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అయితే, కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతోనే మృతి చెందినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన విషయాలపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also- Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్

Just In

01

TS Politics: కేసీఆర్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

Viral News: కుక్క కాటుకు చనిపోయిన గేదె.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన జనం, ఎందుకంటే?

Jr NTR: ఢిల్లీ హైకోర్టు‌కు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే