GHMC: జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 300 వార్డుల్లో ఈ నెల 29న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలం క్రితం పాత జీహెచ్ఎంసీ ఏరియా పరిధిలోని 30 సర్కిళ్లలో ఈ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెల్సిందే. పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత మరో సారి డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్ సూచించారు. శనివారం సికింద్రాబాద్, మల్కాజ్ గిరి జోన్లలో కమిషనర్ కర్ణన్ సంబంధిత జోనల్ కమిషనర్లు రవి కిరణ్, మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు ఎఫెక్టుగా జరిగేలా మానిటరింగ్ చేయాలని కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో దీర్ఘకాలంగా పేరుకుపోయిన వ్యర్థాలు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
వీధి కుక్కల సమస్య
సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజా భద్రత, పారిశుధ్యం, పాదచారుల మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిస్థితులను కమిషనర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వీధి కుక్కల సమస్యను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుక్కలు చుట్టు పక్కల ప్రాంతాల నుండి ఆసుపత్రి ప్రాంగణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు కమిషనర్ గుర్తించిన కమిషనర్ సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ తో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.
Also Read: Wine Shop Owner: వైన్స్ షాప్ యజమాని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లు… అంతా షాక్
పేరుకుపోయిన చెత్త కుప్పలు
ఆసుపత్రి ఆవరణలోని కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్ లకు తరలించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వెటర్నరీ అధికారులు తమ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, పాఠశాలలు, జనసంచార ప్రదేశాలలో రోజు వారీగా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, వీధి కుక్కలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, జనసంచార ప్రాంతాల్లో కుక్క కాటు ఘటనలు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కల బెడద పై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. ఫుట్ పాత్ లపై పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి, ఫుట్ పాత్ లను పాదచారులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మల్కాజ్ గిరి జోనల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లను కమిషనర్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా మానిటర్ చేయాలని, రోడ్లను, వీధులను క్లీన్ గా ఉండేలా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
Alsi Read: DGP Shivadhar Reddy: సీఐ, ఎస్‌ఐలపై డీజీపీ శివధర్ రెడ్డి ఫుల్ సీరియస్.. అలా చేస్తే వేటు!

