DGP Shivadhar Reddy: పోలీస్ స్టేషన్లపై డీజీపీ నిఘా..!
భూ సెటిల్మెంట్లకే పోలీసుల ప్రాధాన్యత!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే అధికం
సీఐ,ఎస్‌ఐలపై డీజీపీ సీరియస్
ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హుకుం
సివిల్ వివాదాల్లో తలదూర్చితే వేటు తప్పదని వార్నింగ్
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రియల్ వ్యాపారులకు పోలీసు స్టేషన్లు స్వంత ఇళ్ల మాదిరిగా మారిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పదేండ్లు భూ వివాదాలు పోలీసు స్టేషన్లలోనే పరిష్కారం జరిగాయనే ప్రచారం జోరుగా ఉంది. అదే పద్దతిని ప్రస్తుత ప్రభుత్వంలో అక్కడక్కడా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వివాద భూములను వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడం… పోలీసులను ఆశ్రయించి న్యాయం తమవైపు తిప్పుకోవడం ఆలవాటైయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు తమ పనులు సులభంగా సాగిపోయేందుకు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, సమస్య ఉంటే పోలీసులను చేతిలో పెట్టుకొని బలహీన ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. ఈ విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) పోలీసు స్టేషన్లపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పరోక్షంగా ప్రతి పోలీస్ స్టేషన్లోని సీఐ, ఎస్ఐలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
Read Also- Digvijaya Singh: మోదీ పాత ఫొటో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు బహిర్గతం?
అక్రమ ఆదాయానికి గండీ….
ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్ల్లో క్రిమినల్, క్రైం కేసుల కంటే సివిల్ కేసులపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెలకు ఒక్కటి సివిల్ కేసుకు సంబంధించినవి వస్తే పోలీసులకు పండుగేననే ప్రచారం ఉంది. భూ వివాదం కేసు దొరికితే ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైన సమయం ఇచ్చేందుకు పోలీసులు శ్రమచూపుతున్నారు. అదే ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టేందుకు నెలలు కష్టపడుతారు. అంతేందుకు న్యాయ బద్దంగా భూ వివాదంపై కోర్టు ద్వారా స్టే అర్డర్ గానీ, ఇన్జంక్షన్ అర్డర్ గానీ, అక్రమంగా కబ్జా చేసిన వాడిపై కోర్టు పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని స్వాధినం చేసుకోవాలని అర్డర్లు ఇస్తుంది. ఈ అర్డర్లపై పోలీసులు స్పందించేందుకు మనస్సు రాదు. ఎందుకంటే లీగల్గా ఉన్న భూ యాజమాన్యులకు సహకరిస్తే కమీషన్లు ఉండవ్ కదా…! అందుకే అక్రమార్కులకు వంతపాడుతారనే చెడ్డ అభిప్రాయం పోలీసులపై ప్రజలకు ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోలీసుల అక్రమ ఆదాయానికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది.
సివిల్ కేసుల్లో తలదూర్చోద్దు…
భూ ధరలు భారీగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పోలీసు స్టేషన్లలో సెటిల్మెంట్లు నడిచినట్లు ఉన్నతాదికారుల వద్ద ఆధారాలున్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీసులకు డీజీపీ సిరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. భూ సమస్యలపై పోలీసులను ఆశ్రయించిన బాధితులకు ఏవిధంగా వెళ్లాలనే విషయం క్షుణంగా వివరించాలని తెలిపారు. అంతేకాకుండా భూ సమస్యల్లో న్యాయం, అన్యాయం చేప్పే అవకాశం పోలీసులకు ఉండదని డీజీపీ పోలీసులకు సూచించారు. కేవలం కోర్టు ఆదేశాలను మాత్రమే పాటించాలని, అందుకు అనుగుణంగా వ్యవహారించాలని తెలిపారు. కోర్టు ఆదేశాలకు అతీతంగా ఎవరు వ్యవహారించినా, వ్యక్తిగత ప్రయేజనాల కోసం సివిల్ విషయంలో తలదూర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీజీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఏ పోలీసు స్టేషన్లో సివిల్ సమస్యలపై సెటిల్మెంట్ ఆరోపణలు వచ్చిన పరిణామాలు సిరియస్గానే ఉంటాయని డీజీపీ తెలిపినట్లు అధికారిక సమాచారం.
ఫిర్యాదుల వెల్లువ…
బడా రియల్ వ్యాపారులు అక్రమాలను సొమ్ముగా చేసుకుంటూ భూదందాను కొనసాగిస్తున్నారు. ఆ భూ దందా కూడా అధికార పార్టీలోని కొంతమంది బ్రోకర్ లీడర్లు, పోలీసుల అండదండలతో రియల్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు చేసే ఆగడాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పోంగులెటి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు భారీగా ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. పోలీసులు గత ప్రభుత్వంలో వ్యవహారించిన తరహాలోనే నగర శివార్లలో పనిచేసే సీఐ, ఎస్ఐలు పనిచేస్తున్నారని మంత్రులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. లంచాలు తీసుకుంటూ సామాన్యులపై పోలీసులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృత్తమైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మంత్రులు సీఎంతో వివరించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి డీజీపికి సూచనలు చేస్తూ పోలీసుల పద్దతి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు సుస్పష్టం.
ఈ స్టేషన్లలో అదే పనిగా…
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, మీర్పేట్, ఆదిబట్ల, ఎల్బీనగర్, కడ్తాల్, అబ్ధుల్లాపూర్ మెట్టు, అమన్గల్లు, మాడ్గుల, ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసార్, నార్సింగ్, శంషాబాద్, షాద్నగర్ తదితర పోలీసు స్టేషన్లో ఇదే పనిగా కొనసాగుతుందని ఆరోపణలున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు… మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని ఓ భూ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకున్నట్లు బహిరంగంగానే చర్చ నడుస్తుంది. అలాగే మహేశ్వరం మండలం తుమ్మలూరులోని భూ వివాదం పై పోలీసులు మాట్లాడడం జరిగింది. హయత్నగర్లో పోలీసులు తోర్రుర్ ఓ ప్లాట్ విషయంలో సెటీల్మెంట్ చేశారు. అబ్ధుల్లాపూర్మెట్టు పోలీసులు లష్కర్ గూడ భూ స్థలంలో ఓప్పందాలు చేశారు. ఇలా ప్రతి పోలీసుస్టేషన్లో ఒక కేసు చోప్పున కేస్ స్టడీ ఉంది. ఇప్పటికైన పోలీసులు నమ్మి వచ్చిన బాధితులకు అండగా ఉండాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

