GHMC Mega Budget: రూ.11,460 కోట్లతో మెగా బడ్జెట్
మెగా బడ్జెట్ ముసాయిదా రెడీ!
వర్తమాన బడ్జెట్ కంటే రూ. 450 కోట్లు అధికం
29న స్టాండింగ్ కమిటీ ముందుకు బడ్జెట్
స్టాండింగ్ కమిటీ అభిప్రాయలతో స్వల్ప మార్పులకు ఛాన్స్
వచ్చే నెలలో కౌన్సిల్ ఆమోదం
తదుపరి ఆమోదం కోసం సర్కారు చేరవేత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ కొత్త ఆర్థిక సంవత్సరానికి (2026-27) మెగా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు సమాచారం. సుమారు రూ.11,460 కోట్లతో మెగా బడ్జెట్‌ను సిద్దం చేసినట్లు సమాచారం. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి రూపొందించిన రూ.11 వేల 10 కోట్ల బడ్జెట్‌తో పోల్చితే కొత్త వార్షిక బడ్జెట్ రూ.450 కోట్లు పెంచి రూ. 11 వేల 460 కోట్లతో రూపకల్పన చేశారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అసరాలు, అభివృద్ది, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం.
Read Also- Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?
ఈ ముసాయిదాను ఈ నెల 29 న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నారు. స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలను స్వీకరించనున్న అధికారులు ప్రస్తుత బడ్జెట్ ముసాయిదాలో అవసరమైన స్థాయిలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిసింది. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత వచ్చే నెలలో బడ్జెట్‌పై నిర్వహించనున్న స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించి, తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంనున్నట్లు సమాచారం. విలీన పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన భవన నిర్మాణ అనుమతుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతున్నందున ఈసారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6441 కోట్లుగా పొందుపరిచారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ.4 వేల 57 కోట్లుగా పేర్కొన్నారు.
Read Also- Sangareddy: ఆసుపత్రికి బయలుదేరిన పెద్దాయన.. మధ్యలోనే అనూహ్య రీతిలో మృత్యువు
బడ్జెట్ ముఖ్యాంశాలు
మొత్తం బడ్జెట్ : రూ. 11,460 కోట్లు (గత ఏడాది బడ్జెట్ కన్నా ఇది సుమారు రూ. 450 కోట్లు అధికం)
ఆదాయం : రూ. 6,441 కోట్లు
వ్యయం: రూ. 4,057 కోట్లు
రెవెన్యూ మిగులు: రూ. 2,384 కోట్లు
పెట్టుబడుల వ్యయం: రూ. 7,403 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.

